29.2 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

భారత యువ క్రికెటర్లు… ప్రేమకథలపై పుకార్లు!

దేశంలో క్రికెట్  ఒక క్రీడ మాత్రమే కాదు. అదో మతం. క్రికెట్ అభిమానులు ఆటపైనే కాకుండా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపై కూడా ఆసక్తి చూపుతారు. క్రికెటర్లు అభిమానుల నుండి ప్రేమ, ప్రశంసలను అందుకుంటూనే... పుకార్లు, రకరకాల ఊహాగానాలకు కూడా గురవుతారు.

పిఎల్ ప్రారంభంతో, భారతదేశం అంతటా మిలియన్ల మంది అభిమానులు ఆత్రంగా ఆటను చూస్తున్నారు. ఆటగాళ్ల ఆటతీరుపై నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే దేశంలో క్రికెట్  ఒక క్రీడ మాత్రమే కాదు. అదో మతం. T20, ODIలు, IPL లేదా ప్రపంచ కప్‌లు ఏవైనా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మ్యాచ్‌లను ఆస్వాదించడానికి స్టేడియానికి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. క్రికెట్ అభిమానులు ఆటపైనే కాకుండా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపై కూడా ఆసక్తి చూపుతారు.

క్రికెటర్లు అభిమానుల నుండి ప్రేమ, ప్రశంసలను అందుకుంటూనే… పుకార్లు, రకరకాల ఊహాగానాలకు కూడా గురవుతారు. కొంతమంది క్రికెటర్లు తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచుకోవాలని ఎంచుకుంటే మరికొందరు పబ్లిక్‌తో పంచుకోవడానికి ఇష్టపడతారు.

సినిమా హీరోయిన్స్‌తో మన యువ క్రికెటర్లు (Cricketers) ప్రేమలో పడటం సాధారణమే విషయమే. ఇప్పటికే టిమిండియా (Team India) క్రికెటర్లు పలువురు బాలీవుడ్‌ (Bollywood) భామలతో ప్రేమ వ్యవహరం నడిపిన సంగతి తెలిసిందే. అందులో కొందరు బ్రేకప్‌ చెప్పుకుని విడిపోగా.. మరికొందరూ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

1. రిషబ్ పంత్ – ఇషానేగి

Source: Isha Negi/Instagram

రిషబ్ పంత్ చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించిన ప్రతిభావంతుడైన క్రికెటర్.  అతనిలో ఆకట్టుకునే క్రికెట్ నైపుణ్యాలతో పాటు నాణేనికి మరోవైపు ప్రేమ కథలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.  2019లో రిషబ్ సోషల్ మీడియాలో ప్రపంచానికి పరిచయం చేసిన ఇషా నేగితో రిలేషన్‌షిప్‌ను బయటపెట్టాడు.    రిషబ్ తన ఇన్‌ష్టాగ్రామ్‌  క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు.  ఇషాను సంతోషపెట్టాలనే కోరికను వ్యక్తం చేశాడు, తన ఆనందానికి కారణం ఆమెనన్నాడు. దీనికి ప్రతిస్పందనగా ఇషా… రిషబ్‌ను తన మనిషి, సోల్‌మేట్‌, బెస్ట్ ఫ్రెండ్  అని పేర్కొంది.

వీరి ప్రేమకథ క్రికెట్ అభిమానులకు, మీడియాకు భలే ఆసక్తిని కలిగించింది. రిషబ్, ఇషా తాము కలిసిఉన్న ఫోటోలు, వీడియోలను తరుచు సోషల్ మీడియాలో పంచుకుంటారు.

రిషబ్ తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే, తన అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను మునివేళ్లమీద నిలబెడతాడు.  అతను ఎంత ఒత్తిడిలో ఉన్నా.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించిపెట్టాయి.

2020 , 2021 సీజన్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ని IPL ప్లేఆఫ్‌లకు విజయవంతంగా నడిపించినందున రిషబ్ నాయకత్వ నైపుణ్యాలు కూడా మెచ్చుకోదగ్గవి. అయితే ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. 

2. పృద్వీ షా – ప్రాచీసింగ్

source: punjabkesari

అండర్ 19 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాలోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీషా. ఆరంగ్రేటం టెస్టులోనే భారీ సెంచరీ బాదిన పృథ్వీషా, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొడుతున్న పృథ్వీషా…బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రాచీ సింగ్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడట పృథ్వీషా… బాలీవుడ్ హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం నడవడం ఇప్పుడేమీ కొత్త కాదు… ఈ లిస్టులో పృథ్వీసా, ప్రాచీ సింగ్ కూడా చేరిపోయారని టాక్ వినిపిస్తోంది.

గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. స్వల్ప స్కోర్లకే అవుటై పెవిలియన్‌లో నిరాశగా కూర్చోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో పృథ్వీ స్మైల్‌ను మిస్ అవుతున్నానంటూ పోస్టు చేసింది ప్రాచీ సింగ్. హిందీ సీరియల్ ‘ఉదాన్’తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రాచీ సింగ్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పొగొడుతూ ఉంటుంది. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ప్రాచీ సింగ్. ఇద్దరు కలిసి పార్టీలకు, డిన్నర్‌ డేట్స్‌ వెళుతూ చాలా సార్లు కెమెరాలకు  చిక్కారు. దీంతో పృథ్వీ, ప్రాచీ ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ కొద్ది రో జులు వార్తలు వినిపిపించాయి.  ప్రాచీని పృథ్వీషా రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా అంతా పేర్కొంటున్నారు.

అయితే లేటెస్ట్ గా ప్రాచీకి పృథ్వీ షా బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ తరువాత ప్రస్తుతం ఐపీఎల్ సన్నహాకాల్లో నిమగ్నమై ఉన్నాడు. అయితే.. ఇటీవల పృథ్వీ, ప్రాచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో, వారి బ్రేకప్ గురించి చర్చ ప్రారంభమైంది. ఇంతకుముందు సోషల్‌ మీడియాలో వీరిద్దరూ తరచూ ఒకరిపోస్ట్‌పై ఒకరూ స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేసుకుంటూ విడిపోయిందని అనుకుంటున్నారు.

౩. ఇషాన్ కిషన్ – అదితి హుండియా

Source: crictracker

బీహార్‌కు చెందిన ఇషాన్ కిషన్ 2016లో ఢాకాలో జరిగిన ప్రపంచ కప్‌లో భారత U-19 కెప్టెన్‌గా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. ఈ ప్రతిభావంతుడైన క్రికెటర్ 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా  ప్రసిద్ది చెందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో కిషన్ రెగ్యులర్ సభ్యుడు.

ఇటీవలి సంవత్సరాలలో, ఇషాన్ కిషన్, అదితి హుండియా మధ్య లవ్ ఎఫైర్ గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. 2019 ఐపీఎల్‌లో ఇషాన్‌ను ఉత్సాహపరిచేందుకు అదితి స్టేడియానికి చేరుకుంది. అప్పటి నుంచి వీరిద్దరీ మధ్య ప్రేమయాణం కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అతడిని విభిన్నంగా అభినందించింది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. తన పోస్టుకు హార్ట్ ఎమోజీలను జత చేస్తూ ఇషాన్ ఫొటోలను షేర్ చేసింది. ఈ విధంగా అతడికి అభినందనలు తెలిపింది. 2017లో మిస్ ఇండియా పోటీలతో కెరీర్ ప్రారంభించిన అదితి FBB కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్‌గా కిరీటాన్ని పొందింది. ఈ జంట రెండేళ్లుగా కలిసి ఉన్నారని వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను చూస్తే తెలుస్తుంది. అదితి తన ‘ఇన్‌స్టాగ్రామ్’లో కథనంతో సహా ఇషాన్‌తో పోస్ట్‌లు కూడా పంచుకుంది.

4. శుభమన్ గిల్ – సారా టెండూల్కర్ 

Source: freepressjournal

క్రికెటర్లకు సినీ తారలకు మధ్య సంబంధాలు కొత్తేమి కాదు. ఏన్నో ఏళ్లుగా వారి మధ్య అఫైర్లు, డేటింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత నయా బ్యాటింగ్ సంచలనం శుభమన్ గిల్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. IPL 2020 సందర్భంగా, సారా తన సోషల్ మీడియాలో శుభ్‌మాన్‌కు తన మద్దతును చూపుతూ కనిపించింది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR ఓడింది. అయినప్పటికీ, సారా క్యాచ్ తీసుకున్న GIFని పోస్ట్ చేయడం ద్వారా Instagramలో శుభ్‌మాన్ ఫీల్డింగ్ నైపుణ్యాలను మెచ్చుకుంది. ఇటీవల ఉప్పల్ స్టేడియంలో  డబుల్ సెంచరీ సాధించిన శుభమన్ గిల్‌ను స్టేడియంలో అభిమానులు టీజ్ చేశారు. సారా సారా అంటూ ఆటపట్టించడం వెనుక బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, అలాగే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ఉన్న ఆఫైర్లే కారణంగా నిలిచింది. శుభమన్ గిల్ పేరు ఈ ఇద్దరి భామలతో ముడిపెడుతూ భారీగా మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో శుభమన్‌ను సారా అంటూ ఆటపట్టించారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles