ప్రధానాంశాలు:
- MCCలో సభ్యత్వం పొందిన 5గురు భారత క్రికెటర్లు
- మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ
- యువరాజ్ సింగ్
- సురేష్ రైనా
- మిథాలీ రాజ్
- ఝులన్ గోస్వామి
లండన్: భారత క్రికెట్ జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా ఐదుగురు ప్రముఖ భారత అంతర్జాతీయ ఆటగాళ్లకు మార్లిబోన్ క్రికెట్ క్లబ్ (MCC) బుధవారం ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ‘లైఫ్ మెంబర్‌షిప్’ ప్రదానం చేసింది.
ప్రతిష్టాత్మక సభ్యత్వం పొందిన ఇతర క్రీడాకారులు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మాజీ మహిళా క్రికెట్ జాతీయ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, దిగ్గజ క్రీడాకారిణి ఝులన్ గోస్వామి.
ఐదుగురు భారత ఆటగాళ్లు సాధించిన విజయాలను MCC తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మహిళల వన్డేల్లో ఝులన్ గోస్వామి అగ్రస్థానంలో ఉండగా, మిథాలీ రాజ్ 211 ఇన్నింగ్స్‌లలో 7,805 పరుగులతో పరుగులగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. MS ధోని, యువరాజ్ సింగ్ 2007 ICC పురుషుల ప్రపంచ T20, 2011 ICC పురుషుల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అంతర్భాగంగా ఉన్నారు. ఇక సురేష్ రైనా 13 సంవత్సరాల కెరీర్‌లో 5,500 ODI పరుగులను సాధించారు.
MCC యొక్క CEO,సెక్రటరీ, గై లావెండర్, MCC యొక్క గౌరవ జీవిత సభ్యుల జాబితాను ప్రకటించినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… వీరంతా గొప్ప అంతర్జాతీయ ఆటగాళ్లు. మా క్లబ్‌లో విలువైన సభ్యులుగా పరిగణించడం మాకు విశేషం.”వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 19 మంది క్రికెటర్లు ఎమ్‌సీసీలో చోటు దక్కించుకున్నట్లు సీఈవో, కార్యదర్శి గై లావెండర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యిలీరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, అన్యా ష్రూబ్‌సోల్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, బంగ్లాదేశ్‌కు చెందిన మష్రాఫ్ మోర్తాజా, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, న్యూజిలాండ్‌కు చెందిన అమీ సటర్‌వైట్, రాస్ టేలర్. ఆస్ట్రేలియాకు చెందిన రాచెల్ హేలకు కూడా గౌరవ సభ్యత్వం దక్కింది.
👏 MCC awards Honorary Life Membership of the Club to some of the world’s finest cricketers.
We can now reveal the names of the latest men and women to have been bestowed with this privilege ⤵️#CricketTwitter
— Marylebone Cricket Club (@MCCOfficial) April 5, 2023