23.7 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

ఐపీఎల్‌లో నేడు మరో హై ఓల్టేజ్ మ్యాచ్…. ముంబయి vs చెన్నై సూపర్ కింగ్స్!

ఐపీఎల్‌లో నేడు మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబయి vs చెన్నై సూపర్ కింగ్స్ అమీ తుమీకి సై అంటున్నాయి. ముంబై జట్టు  ఎల్లప్పుడూ శక్తిమంతమైన ఆటగాళ్లతో నిండి ఉంటుంది. సూపర్ కింగ్స్ ఇప్పటికీ ధోనీపై ఆధారపడింది.

ప్రధానాంశాలు

  • ఐపీఎల్‌లో నేడు మరో హై ఓల్టేజ్ మ్యాచ్
  • ముంబయి vs చెన్నై సూపర్ కింగ్స్ అమీ తుమీ
  • ముంబై జట్టు  ఎల్లప్పుడూ శక్తిమంతం
  • ధోనీపై ఆధారపడ్డ సూపర్ కింగ్స్
  • కీలక ఆటగాళ్ల గైర్హాజరీ
  • ఆయా జట్ల బ్యాక్‌రూమ్‌లలో బ్రావో, పొలార్డ్

ముంబయి: ఐపీఎల్‌లో నేడు సూపర్ సాటర్‌డే రెండు మ్యాచ్ జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ జట్ల మధ్య మద్యాహ్నం గౌహతీలో జరుగనుంది.  ముంబయిలో రాత్రి 7: 30కు ముంబయి vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

ముంబై జట్టు  ఎల్లప్పుడూ శక్తిమంతమైన ఆటగాళ్లతో నిండి ఉంటుంది. గణాంకాల్లో ముంబయి ఆయా ఆటగాళ్ల  ఎప్పుడూ ముందుంటారు.   అయితే సూపర్ కింగ్స్ ఇప్పటికీ ధోనీపై ఆధారపడింది. ఇదిలా ఉండగా కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో కొంత మెరుపులు తగ్గినట్లు కనిపిస్తోంది.

డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్

Sorce: Republic World

డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ సంబంధిత జట్ల బ్యాక్‌రూమ్‌లలో ఉంటారు. జస్ప్రీత్ బుమ్రా  గాయపడి మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. మహేశ్ తీక్షణ ఇంకా రాలేదు. జె. రిచర్డ్‌సన్ మొత్తం సీజన్‌లో గాయం కారణంగా గైర్హాజరు కావడంతో ముంబైకి ఇబ్బందులు తప్పటంలేదు. CSK సోమవారం చెపాక్‌లో సొంత మైదానంలో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ తక్కువ మార్జిన్‌తో ఓడింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ డెత్-బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సిసాండా మగాలా CSKలో చేరాడు. దీంతో టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ సీమ్ బౌలర్ లోటు ఇప్పుడు భర్తీ అవుతుంది.  ‘మగల’ను తీసుకుంటారా? అహ్మదాబాద్, చెన్నై రెండింటిలోనూ ఆకట్టుకునే స్పెల్‌ వేసిన మిచెల్ సాంట్‌నర్‌ను బెంచ్ చేస్తారా? వేచి చూడాలి.

సూపర్ కింగ్స్ టీమ్

Source: Jagaran Josh

సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డెప్త్ – 11నంబర్ బ్యాట్స్‌మెన్‌ దీపక్ చాహర్ కూడా బ్యాట్ ఝలిపించడంలో దిట్ట. అతని బ్యాటింగ్ శైలికి వాంఖడే పిచ్‌కి బాగా సరిపోతుంది.

ముంబై టీమ్

Source: Instagram

ముంబై బ్యాటింగ్ కూడా బాగా శక్తిమంతం. స్వయంగా కెప్టెన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ సులువైన వాంఖడే ట్రాక్‌పై అద్భుతాలు సృష్టించగలరు. అయితే వారి బౌలింగ్ దాడి తేలికగా కనిపిస్తుంది.  ఈ సీజన్ జోఫ్రా ఆర్చర్ జట్టులో చేరినా ముంబైకి పెద్దగా ఒనగూడిందేమీలేదు. నేటి మ్యాచ్‌లోనైనా ఆర్చర్ మెరుపులు చూడగలమో లేదో ఈ రోజు రాత్రికి తేలిపోతుంది.

ముంబై టీమ్  రిచర్డ్‌సన్‌కు బదులుగా సంతకం చేసిన రిలే మెరెడిత్ ఆదివారం ఎంపికకు అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.

ముంబై టీమ్ ప్రాక్టీస్ సెషన్ Instgram Link. https://www.instagram.com/reel/CqhdbuaDmWl/?utm_source=ig_web_copy_link

టాస్, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

Source: T I E, ET

ముంబై ఇండియన్స్

ముంబై మరోసారి కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో ఆడబోతోంది. ఒకవేళ ముందుగా బౌలింగ్ చేయాల్సి వస్తే  బ్యాటర్‌లలో ఒకరి స్థానంలో పవర్‌ప్లే స్పెషలిస్ట్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు. వాంఖడే కొంత ప్రారంభంలో స్వింగ్‌ లభిస్తే… ఆస్ట్రేలియా,పెర్త్ స్కార్చర్స్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేయొచ్చు.

ముంబై మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2వ స్థానంలో ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), 3 సూర్యకుమార్ యాదవ్, 4 కెమరూన్ గ్రీన్, 5 తిలక్ వర్మ, 6 నెహాల్ వధేరా, 7 టిమ్ డేవిడ్, 8 హృతిక్ షోకీన్, 9 అర్షద్ ఖాన్, 10 కుమార్ కార్తికేయ/పీయూష్ చావ్లా, 11 జోఫ్రా ఆర్చర్.

ముందుగా బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 ఇషాన్ కిషన్ (WK), 3 కామెరాన్ గ్రీన్, 4 తిలక్ వర్మ, 5 నేహాల్ వధేరా, 6 టిమ్ డేవిడ్, 7 హృతిక్ షోకీన్, 8 జాసన్ బెరెన్‌డార్ఫ్, 9 అర్షద్ ఖాన్, 10 కుమార్ కార్తికేయ/పీయూష్ చావ్లా, 11 జోఫ్రా ఆర్చర్

చెన్నై సూపర్ కింగ్స్

తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన  సాంట్నర్ స్థానంలో సూపర్ కింగ్స్‌ మగాలాను తీసుకునే అవకాశం ఉంది. ఇక తుషార్ దేశ్‌పాండే తన ‘బౌలింగ్’ను మరింత మెరుగుపరుచుకోవడానికి  సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ బ్రావోతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పాడు. ముందుగా సూపర్ కింగ్స్ బౌలింగ్ చేస్తే దేశ్‌పాండేతోనే బౌలింగ్ దాడి ఆరంభించే అవకాశం ఉంది. వారు బ్యాటింగ్ చేసినప్పుడు అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంబటి రాయుడిని తీసుకుంటుంది.

చెన్నై మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు:: 1 డెవాన్ కాన్వే, 2 రుతురాజ్ గైక్వాడ్, 3 మొయిన్ అలీ, 4 బెన్ స్టోక్స్, 5 శివమ్ దూబే, 6 అంబటి రాయుడు, 7 రవీంద్ర జడేజా, 8 MS ధోని (కెప్టెన్&wk), 9 సిసంద మగల/మిచెల్ సంత్నర్, 10 రాజ్‌వర్ధన్, హంగర్గేకర్, 11 దీపక్ చాహర్

చెన్నై మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 డెవాన్ కాన్వే, 2 రుతురాజ్ గైక్వాడ్, 3 మొయిన్ అలీ, 4 బెన్ స్టోక్స్, 5 శివమ్ దూబే, 6 రవీంద్ర జడేజా, 7 MS ధోని (కెప్టెన్&wk), 8 సిసంద మగల/మిచెల్ సాంట్నర్, 9 రాజ్‌వర్ధన్ హంగర్‌కర్, 1 దీపాక్కర్ చాహర్, 11 తుషార్ దేశ్‌పాండే.

గణాంకాలు 

ముంబై వాంఖడేలో సూపర్ కింగ్స్‌తో ఆడిన పది మ్యాచ్‌లలో ఏడింటిని గెలుచుకుంది. పీయూష్ చావ్లా IPLలో రాయుడుపై మంచి హెడ్-టు-హెడ్ రికార్డును కలిగి ఉన్నాడు, అతనిని 12 ఇన్నింగ్స్‌లలో ఆరు సార్లు అవుట్ చేశాడు. లీగ్‌లో మరే ఇతర బౌలర్‌ కూడా రాయుడును  ఇన్ని ఎక్కువ సార్లు అవుట్ చేయలేదు.
మగాలా సూపర్ కింగ్స్‌కు ఆకర్షణీయమైన పేస్ బౌలర్ ఆప్షన్ అయినప్పటికీ, శాంట్‌నర్‌ను అట్టిపెట్టుకోవడానికి వారికి ఓ ఛాన్స్ ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్ సూర్యకుమార్‌ను ఏడు T20 ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు ఔట్ చేశాడు. అంతేకాదు శాంట్‌నర్‌ వేసిన 56 బంతుల్లో కేవలం 52 మాత్రమే చేశాడు. T20 క్రికెట్‌లో రవీంద్ర జడేజాను ఎదుర్కోవడానికి సూర్యకుమార్  కష్టపడ్డాడు. అతనికి వ్యతిరేకంగా 55 బంతుల్లో 43 పరుగులు మాత్రమే చేశాడు, అయితే మూడు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు.

వాంఖడే పిచ్, పరిస్థితులు

Source: Unsplash

ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియాతో వాంఖడే ODIకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, అది స్వింగ్, సీమ్‌కు సహకరించింది.  శనివారం కూడా మొదట్లో సీమర్లకు కొంత లాభించవచ్చు.  అయితే  IPL పిచ్‌లు చాలా వరకు ఫ్లాట్‌గా ఉంటాయి. ఫలితంగా అధిక స్కోరింగ్‌లు నమోదవుతాయి.  మ్యాచ్ అయిపోయేంత వరకు వాతావరణం వెచ్చగా, తేమగా ఉంటుందని భావిస్తున్నారు.

ఎం.ఎస్ ధోనీకి అభిమానుల మద్దతుపై కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ… “అదృష్టవశాత్తూ లేదా దురదృష్టవశాత్తూ, ధోనీ ఈ సీజన్‌లో ఆడుతున్నప్పుడు, అతను వెళ్ళే ప్రతిచోటా, అతని పాపులారిటీ  కారణంగా  చెన్నై ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ  ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మా జట్టుకు ఐకాన్ సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు మాకూ అలాంటి ఫీలింగే ఉండేది. మేము ఎక్కడికి వెళ్లినా, దేశ వ్యాప్తంగా మాకు మద్దతు దొరికేది.

డెత్ బౌలింగ్‌పై CSK బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో మాట్లాడుతూ…  “బౌలింగ్ కోచింగ్ స్టాఫ్,  ఇతర కోచ్ ఎరిక్ [సిమన్స్], మేమంతా మా బౌలర్లతో నిరంతరం మాట్లాడుతున్నాం. కుర్రాళ్లు వారి స్వంత శైలిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండేలా వారిని ప్రోత్సహించాలి” అని బ్రావో అన్నాడు.

ట్విట్టర్లో రోహిత్, ధోనీ మ్యాచ్ ప్రాక్టీస్ వీడియో

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles