23.7 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

వార్నర్‌లోని అసలైన ఆటగాడు ఎప్పుడొస్తాడు?

డేవిడ్ వార్నర్ క్రికెట్ మైదానంలో వినోదం మాత్రమే కాదు. కోవిడ్-19 ఉధృతంగా ఉన్న సమయంలో కూడా... వార్నర్, అతని కుటుంబం 'రీల్స్'తో సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది. అయితే నెమ్మదిగా ఆడటంపై విమర్శలొస్తున్నాయి.

ప్రధానాంశాలు

  • అసలైన వార్నర్‌ను ఎప్పుడు చూస్తాం
  • విధ్వంసక షాట్‌లు ఇప్పట్లో ఆడలేడా?
  • వార్నర్‌పై ఫైర్ అయిన సెహ్వాగ్
  • వార్నర్ మాత్రం ఓ వారియర్
  • ఫినిక్స్ పక్షిలా మళ్లీ తిరిగొస్తాడు

వార్నర్ కుటుంబం  ‘రీల్స్’ లింక్

https://www.instagram.com/reel/CpZh1MCM6lF/?utm_source=ig_web_copy_link

ఢిల్లీ:  డేవిడ్ వార్నర్ క్రికెట్ మైదానంలో వినోదం మాత్రమే కాదు. కోవిడ్-19 ఉధృతంగా ఉన్న సమయంలో కూడా… వార్నర్, అతని కుటుంబం ‘రీల్స్’తో సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది. అయితే మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ దృష్టి మైదానంపై పడింది. అతను  ఉద్దేశపూర్వకంగా పొట్టి పొట్టి అడుగులు వేస్తూ, చేతులు గిరగిరా తిప్పుతూ, stretching చేస్తూ క్రీజులోకి వచ్చాడు. తరువాత ఓ పుల్ షాట్ ఆడి.. గాల్లోకి పంచ్ విసిరాడు. ఈ ఐపీఎల్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడో అర్ధశతకం పూర్తి చేసినప్పటికీ, ఆ మైలురాయిని చేరుకోవడానికి  43 బంతులు తీసుకోవడంతో అభిమానులు ‘ప్చ్’ అంటూ పెదవివిరుస్తున్నారు.

డేవిడ్ వార్నర్

Source: Instagram

అసలు వార్నర్ బ్యాటింగ్ చేసే తీరు భలే తమాషాగా  ఉంటుంది.  బంతిని చూడ్డం ఆలస్యం దానిపైకి చిరుతలా లంఘిస్తాడు. రెప్పపాటులో బంతిని బౌండరీ దాటిస్తాడు. అతను IPLలో 820 బౌండరీలు కొట్టాడు, టోర్నమెంట్ చరిత్రలో శిఖర్ ధావన్ తర్వాత రెండవ అత్యధిక బౌండరీలు కొట్టిందే వార్నరే.  360-డిగ్రీ బ్యాటింగ్ వంటి ఆధునిక విధానం లేకుండా వార్నర్ దీన్ని సాధించాడు.  మైదానంలో సాంప్రదాయ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు.

SRHకు ఒంటిచేత్తో IPL టైటిల్‌ అందించిన వార్నర్

Source: Republic world

2016లో, వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఒంతిచేత్తో IPL టైటిల్‌కు అందించాడు. అతని 884 పరుగులు చేశాడు.  అయితే, ఇటీవలి సీజన్లలో, అతను  పరుగుల కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. 2021లో, అతని 195 పరుగులలో 49.2% మాత్రమే బౌండరీల నుండి వచ్చాయి. 2023లో ఇప్పటిదాకా చేసిన 220 పరుగులలో 51.7% మాత్రమే ఆ విధంగా స్కోర్ చేశాడు.

ఎక్కువ సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, రోప్‌లను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని స్ట్రైక్ రేట్ ఏడేళ్లలో కనిష్టంగా ఉంది. అయినప్పటికీ, వార్నర్ క్రికెట్ మైదానంలో బలమైన ఆటగాడు. ఆట పట్ల అంకితభావంతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు.

వార్నర్‌ అంటే ప్రత్యర్థికి దడ

Source: The Indian Express

వార్నర్‌కి ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యర్థికి అతను ఎక్కడ గురి పెట్టాడో తెలిసినప్పటికీ బౌండరీలు కొట్టగల అతని సామర్థ్యానికి ఫిదా అవుతారు. వార్నర్ ఫాన్సీ షాట్‌లు లేకుంటే అసాధారణమైన స్ట్రోక్‌లపై ఆధారపడడు. అతను బంతిని  ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడో అక్కడ కొట్టడానికి తన కంటిని టైమింగ్‌ను సమన్వయం చేసుకుంటాడు. ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్స్, టూలను తీయడంపై దృష్టి పెడతారు కానీ వార్నర్ గేమ్ ప్లాన్ అంతా ఫోర్లు,  సిక్సర్‌లపైనే ఉంటుంది.

వార్నర్ బ్యాటింగ్ సగటు  అద్భుతంగా  ఉన్నప్పటికీ,  దీర్ఘకాలంలో స్థిరంగా ఉందా అని ప్రశ్నించే విమర్శకులు ఇప్పటికీ ఉన్నారు. బౌలర్లు అతని ఉద్దేశాలను చదవడంలో మరింత ప్రవీణులు కావడంతో, అతను పరుగులు సాధించడానికి కష్టపడుతున్నారని వారు వాదిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి, వార్నర్ ఆటలో తన విధ్వంక ఆటతో అభిమానులను అలరించే వార్నర్ కాకుండా ఓ  సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్‌గా మిగిలిపోయాడు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అతని ఆటను చూడటానికి ఇష్టపడతారు.

వార్నర్ కుటుంబం

Source : Instagram

వార్నర్ స్టేడియం బయటికి బంతిని పంపినా లేదా సోషల్ మీడియాలో అభిమానులను అలరించినా, డేవిడ్ వార్నర్ ఎల్లప్పుడూ ఒక వారియర్. అతను ఆడుతూనే ఉన్నంత కాలం, అభిమానులు తన చుట్టూ తిప్పుకుంటాడు.

నిన్న ఢిల్లీలో వార్నర్ స్లో పిచ్‌పై ఆడాల్సి వచ్చింది.  బంతి పాతబడ్డాక, ఫీల్డ్ పరిమితులు తొలగించిన తర్వాత గానీ స్ట్రోక్ ప్లేని ప్రారంభించలేదు. వార్నర్ వంటి బ్యాటర్‌కు ఇది తగదు. ముఖ్యంగా ఈ రకమైన ఫామ్‌లో, మరియు 18వ ఓవర్‌లో అతను బ్యాక్-టు-బ్యాక్ స్లో బంతులను వదిలేయడం బాలేదు.

డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ 

Source: The Indian Express

అయితే ఇదే మ్యాచులో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. అక్షర్ పటేల్ ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడు. అతను క్రీజులో ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టిన 10 బౌండరీలలో తొమ్మిది తనే కొట్టాడు. అతని విజయ రహస్యం బహిరంగమే.

అక్షర్ మాట్లాడుతూ…”పిచ్‌పై బంతి ఆగి, ఆగి వస్తోంది”. అని అక్షర్ మిడ్-ఇన్నింగ్స్ ఇంటర్వ్యూలో  చెప్పాడు. “దీంతో స్లో పిచ్‌పై ఎలాంటి షాట్‌లు ఆడాలో  నేను గుర్తించా. స్లో పిచ్‌పై షాట్ సెలక్షన్ ముఖ్యం. నేను బంతిని బలంగా హిట్ చేసేందుకు ప్రయత్నించలేదు.” అని అక్షర్ చెప్పాడు.

వార్నర్ మాత్రం ఆ పని చేయలేకపోయాడు. ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తున్న బౌలర్ల రిథం దెబ్బతీయడంలో విఫలమయ్యాడు. షాట్ సెలక్షన్ 13వ ఓవర్‌లో ఒక బంతి ఉంది, అక్కడ అతను ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆపై స్వీప్ చేయాలని మనసు మార్చుకున్నాడు. చివరకు  ఏమీ చేయలేకపోయాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడు అక్షర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను కొన్నిసార్లు నంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న అక్షర్ చేసిన 54 పరుగులను చూసి అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడిప్పుడే కెరీర్ నిర్మించుకుంటున్న వ్యక్తి కఠినమైన పిచ్‌పై ధూం ధాం  ఇన్నింగ్స్‌ను ఆడటం బహుశా యాదృచ్చికం కాదు. తన జట్టు  ఒత్తిడిలో ఉన్నప్పుడు తనలోని అత్యుత్తమ బ్యాటర్ వెలికిలోకి తీసుకొచ్చాడు.

అన్నింటికంటే మించి వార్నర్ బంతిని హిట్ చేయాలనుకున్నప్పుడల్లా అది మిస్ ఫైర్ అవుతూనే ఉంది.  ఎనిమిదో ఓవర్‌లో, హృతిక్ షోకీన్ ఆఫ్‌స్పిన్‌లో ఫ్రీ హిట్‌ను ఎదుర్కొన్నాడు. కేవలం మిస్క్యూడ్ సింగిల్ మాత్రమే లభించింది. అసలు వార్నర్ తన ఆటను తానే క్లిష్టతరం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.

అయితే ఒక విషయం ఫినిక్స్ పక్షిలా అతను తన రిథం అందిపుచ్చుకున్న రోజున మాత్రం బంతిని స్టాండ్స్ లోకి పంపించడం ఖాయం.  త్వరలోనే మనం వార్నర్‌లోని అసలైన ఆటగాడిని చూడొచ్చేమో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles