23.7 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

ఐపీఎల్‌లో నేడు KKR, SRHల మధ్య ఆసక్తికర పోరు!

ఐపీఎల్‌లో నేడు KKR, SRH జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు ఈ సీజన్‌లో తమ మొదటి గేమ్‌లలో ఓడిపోయాయి.  పంజాబ్ కింగ్స్‌తో  జరిగిన పోరులో  గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.  నేడు అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. తామేమీ తక్కువ కాదంటోంది KKR...

ప్రధానాంశాలు:

  • ఐపీఎల్‌లో నేడు KKR vs SRH
  • గెలుపుపై ఇరు జట్లు ధీమా
  • జాసన్ రాయ్, లిట్టన్ దాస్ వచ్చేశారు
  • రెట్టించిన ఉత్సాహంతో కేకేఆర్
  • తగ్గేదేల్యా అంటున్న ఆరెంజ్ ఆర్మీ

కోల్‌కతా: ఐపీఎల్‌లో నేడు KKR, SRH జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాత్రి 7:30కు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆరంభం కాబోతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఈ సీజన్‌లో తమ మొదటి గేమ్‌లలో పరాజయం పాలయ్యాయి.  ఐపీఎల్ 2023 లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిన తర్వాత   మూడు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో  జరిగిన పోరులో  సూపర్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.  నేడు అదే జోరును కొనసాగించాలనుకుంటోంది.

KKR, SRH టీమ్స్

Source: The Indian Express

మరోవైపు సంచలన ప్రదర్శనతో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించిన కేకేఆర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేయనుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి ఓవర్‌లో రింకూ ఐదు సిక్సర్లు బాదినప్పటి నుంచి క్రికెట్ ప్రపంచం ఇంకా మరిచిపోలేదు.

మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్న KKR టీమ్

https://www.instagram.com/reel/Cq5vS7dNp3K/?utm_source=ig_web_copy_link

ఆ అద్భుత ఇన్నింగ్స్‌ పూర్తయి మూడు రోజులు కావస్తున్నా నైట్ రైడర్స్ ఇంకా వార్తల్లో ఉంది.  రెండు సార్లు 200-ప్లస్ స్కోర్‌లు సాధించి – ఒకటి డిఫెండ్ చేసుకొని, మరొకటి ఛేజ్ చేసి ఫ్లేఆఫ్ రేసులో తామూ ఉన్నామంటూ…. తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. ఈ రెండు మ్యాచుల్లో నైట్ రైడర్స్ కొత్త హీరోలను ఆవిష్కరించింది.  ముందు  మ్యాచ్‌లో బ్యాట్‌తో సంచలనం సృష్టించిన శార్దూల్ ఠాకూర్, తర్వాతి మ్యాచ్‌లో రింకూ సింగ్ మ్యాచ్‌లను మరో స్థాయికి తీసుకెళ్లి సంచలనం సృష్టించారు.

SRH టీమ్

Source: Twitter

సన్‌రైజర్స్ కూడా మొదటి రెండు గేమ్‌లలో ఓడాక దక్షిణాఫ్రికా ఆటగాళ్ల రాకతో మరింత బలమైన యూనిట్‌గా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కొత్త బంతితో రెండు వికెట్లు తీయగా, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 21 బంతుల్లో 37 పరుగులతో రాహుల్ త్రిపాఠికి సహాయక పాత్ర పోషించాడు. లెగ్‌స్పిన్నర్ మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో   నాలుగు ఓవర్లు వేసి  15 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.  స్పిన్‌కు అనుకూలించే  ఈడెన్ గార్డెన్ పిచ్ పై కేకేఆర్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించేందుకు మార్కండే సిద్ధమవుతున్నాడు.

హ్యారీ బ్రూక్

 

Source: Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్  రూ. 13.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన  ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్  ఇంకా  ఈ లీగ్ లో తన మార్క్ చూపించలేదు. మూడు మ్యాచ్‌లలో విఫలమైనా  బ్రూక్ ప్రమాదకర ఆటగాడే.  కాస్త కుదురుకుంటే  తన విధ్వంసం ఎలా ఉంటుందో  పాకిస్తాన్, న్యూజిలాండ్ పై  అతడి ఆట చూసినవారికి తెలుసు.  క్రీజులోకి కాన్ఫిడెన్స్ గానే వస్తున్న బ్రూక్..   ఐపీఎల్‌కు కొత్త. ఈ మ్యాచ్ లో అయినా అతడు  మెరుపులు మెరిపిస్తే  అది హైదరాబాద్ కు అదనపు బలమే..

జాసన్ రాయ్, లిట్టన్ దాస్, రహ్మానుల్లా గుర్బాజ్ 

Source: InsideSports

టీమ్ వార్తలు – జాసన్ రాయ్, లిట్టన్ దాస్ వచ్చేశారు.

నైట్ రైడర్స్ ఇంకా ఓపెనింగ్ కాంబినేషన్‌ ఇంకా కుదురుకోలేదు.  రహ్మానుల్లా గుర్బాజ్ ఇప్పటివరకు మూడు గేమ్‌లలో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు జాసన్ రాయ్, లిట్టన్ దాస్ జట్టులో చేరడంతో కోల్‌కతా ఓపెనింగ్ సమస్య కాస్త తీరినట్టే.

టాస్, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

Source: T I E, ET

కోల్‌కతా నైట్ రైడర్స్ 

నైట్ రైడర్స్ చివరి గేమ్‌లో మన్‌దీప్ సింగ్, టిమ్ సౌథీ స్థానాల్లో ఎన్. జగదీసన్, లాకీ ఫెర్గూసన్‌లను తీసుకుంది. ఆ జట్టు మొదట బౌలింగ్ చేస్తే వారి ఫైనల్ XIలో సుయాష్ శర్మను ఎంచుకునే అవకాశం ఉంది, అతని కోసం వెంకటేష్ లేదా జగదీశన్‌కి ఉపసంహరించుకోవచ్చు. అయితే మొదట బ్యాటింగ్ చేస్తే ఆ ఇద్దరు ఫైనల్ XIలో ఉండరు.

Soure : Wisden

KKR మొదట బ్యాటింగ్ చేస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1. రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్) 2 N జగదీషన్, 3 వెంకటేష్ అయ్యర్, 4 నితీష్ రాణా (కెప్టెన్), 5 ఆండ్రీ రస్సెల్, 6 రింకు సింగ్, 7 శార్దూల్ ఠాకూర్, 8 సునీల్ నరైన్, 9 లాకీ ఫెర్గూసన్,  10. ఉమేష్ యాదవ్, 11 వరుణ్ చక్రవర్తి.

KKR మొదట బౌలింగ్ చేస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1. రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), 2 వెంకటేష్ అయ్యర్, 3 నితీష్ రాణా (కెప్టెన్), 4 ఆండ్రీ రస్సెల్, 5 రింకూ సింగ్, 6 శార్దూల్ ఠాకూర్, 7 సునీల్ నరైన్, 8 లాకీ ఫెర్గూసన్, 9 ఉమేష్ యాదవ్, చక్రవర్తి, 11 సుయాష్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్

అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో హ్యారీ బ్రూక్ రావడం ఖాయం. కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కీపర్‌గా  హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకుంది. సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తే అబ్దుల్ సమద్‌ని  తీసుకురావాలని చూస్తారు – ప్రత్యేకించి అది ఛేజింగ్ అయితే – బౌలర్లలో ఒకరు తమ లైనప్‌ను బలోపేతం చేసుకుంటారు.

Source: Twitter

SRH మొదట బ్యాటింగ్ చేస్తే వారి ఫైనల్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు: 1 మయాంక్ అగర్వాల్, 2 హ్యారీ బ్రూక్, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్రామ్, 5 హెన్రిచ్ క్లాసెన్, 6 అబ్దుల్ సమద్, 7 వాషింగ్టన్ సుందర్, 8 మార్కో జాన్సెన్, 9 మయాంక్ మార్కండే, 10 భువనేశ్వర్ కుమార్, 10 భువనేశ్వర్ కుమార్, 1 టి నటరాజన్

SRH మొదట బౌలింగ్ చేస్తే వారి ఫైనల్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు: : 1 మయాంక్ అగర్వాల్, 2 హ్యారీ బ్రూక్, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), 5 హెన్రిచ్ క్లాసెన్ (వికెట్), 6 వాషింగ్టన్ సుందర్, 7 మార్కో జాన్సెన్, 8 మయాంక్ మార్కండే, 9 భువనేశ్వర్ కుమార్, 10 ఉమ్రాన్ మాలిక్, 11 టి నటరాజన్.

గణాంకాలు – సన్‌రైజర్స్ స్పిన్ సమస్యలు

  • ఐపీఎల్ 2022లో 11 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ చక్రవర్తి కేవలం ఆరు వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
  • 2022 నుండి ఐపిఎల్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 15 సిక్సర్లు మాత్రమే కొట్టింది.
  • సన్‌రైజర్స్ IPL 2023లో స్పిన్నర్‌లతో పోరాడింది. వారు ఇప్పటివరకు స్పిన్‌తో 12 వికెట్లు కోల్పోయారు.  ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ఇది రెండవ అత్యధికం. వారు ఈ సీజన్‌లో స్పిన్నర్లపై అత్యల్ప స్ట్రైక్ రేట్ (101) మరియు సగటు (13.7) కూడా కలిగి ఉన్నారు.

కోట్స్

నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మాట్లాడుతూ…. “T20 ఒక అద్భుతమైన ఆట. చివరి బంతిలో ఆట గెలవవచ్చు లేదా ఓడిపోవచ్చు. నేను భాగమైన ప్రతి IPL అంతటా, ప్రతి గేమ్ చివరి ఓవర్ వరకు వచ్చినట్లు అనిపిస్తుంది, అందుకే ఐపీఎల్  చాలా గొప్ప లీగ్ ”

హైదరాబాద్ కెప్టెన్ మార్ క్రమ్ మాట్లాడుతూ… గత రెండు మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్ విధ్వంసకర బ్యాటింగ్ చూసి తాము భయపడట్లేదని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్ క్రమ్ అన్నాడు. ఆఖరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు తమ దగ్గర ఉన్నారని తెలిపాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles