23.7 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

తనయుడి ఐపీఎల్ అరంగేట్రంపై సచిన్ భావోద్వేగ ట్వీట్!

తనయుడి ఐపీఎల్ అరంగేట్రంపై సచిన్ భావోద్వేగ ట్వీట్. "అర్జున్, ఈ రోజు నువ్వు క్రికెటర్‌గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు. ఇది ఒక అందమైన ప్రయాణానికి నాంది కావాలి. ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ అర్జున్‌ను ఉద్దేశించి తండ్రీ కొడుకుల చిత్రాలతో పాటు  సచిన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రధానాంశాలు:

  • అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగ్రేటం
  • తనయుడిపై సచిన్ భావోద్వేగ ట్వీట్
  • క్రికెట్ ఆటకు గౌరవాన్ని ఇవ్వమని సలహా
  • ఇది అందమైన ప్రయాణానికి నాంది కావాలి
  • మరింత కష్టపడాలంటూ సూచన
  • ముంబై డగౌట్‌లో తండ్రి, తనయుడు

ముంబై: దిగ్గజ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ ఆదివారం ఇక్కడ వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్‌ టోర్నీలో ఆడిన తొలి తండ్రీ కొడుకులుగా రికార్డుల్లోకి ఎక్కారు.

తనయుడి ప్రాక్టీసును గమనిస్తున్న సచిన్

ఈ క్రమంలో తనయుడి ఐపీఎల్‌ ఎంట్రీపై సచిన్‌ భావోద్వేగానికి గురయ్యారు‌. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ ట్వీట్  షేర్‌ చేశారు.

“అర్జున్, ఈ రోజు నువ్వు క్రికెటర్‌గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు. నిన్ను ప్రేమించే నీ తండ్రిగా, ఆటపై మక్కువ ఉన్న వ్యక్తిగా,  క్రికెట్‌కు నువ్వు తగిన గౌరవాన్ని ఇస్తావని.. గేమ్‌ కూడా నీకు తగిన ప్రేమను అందిస్తుందనే నమ్మకం నాకుంది. నువ్వు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డావు. ఈ శ్రమను నువ్వు కొనసాగిస్తావని భావిస్తున్నా. ఇది ఒక అందమైన ప్రయాణానికి నాంది కావాలి. ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ అర్జున్‌ను ఉద్దేశించి తండ్రీ కొడుకుల చిత్రాలతో పాటు  సచిన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌  నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 3.7 మిలియన్లమంది వీక్షకులు దీన్ని వీక్షించారు.

ఆల్‌రౌండర్ అయిన అర్జున్ టెండూల్కర్‌ ఐపీఎల్ అరంగేట్రం కోసం రెండేండ్లు వేచి చూడాల్సి వచ్చింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ టీమ్స్‌ 2021 ఐపీఎల్‌ సీజన్‌లోనే జట్టులోకి తీసుకుంది. ఆ వేలంలో కనీస ధర అయిన రూ. 20 లక్షలకు అర్జున్‌ను కొనుగోలు చేసింది. కానీ, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. 2022లో కూడా అర్జున్‌ను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ సీజన్‌లో కూడా తొలి మూడు మ్యాచ్‌లకు అర్జున్‌ను ఆడించలేదు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఫైనల్‌ 11లోకి సెలెక్ట్‌ చేసింది.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles