ప్రధానాంశాలు:
- నేడు CSKతో SRH ఢీ
- ఆడిన 5 మ్యాచుల్లో 3 గెలిచిన చెన్నై
- 5 మ్యాచుల్లో 2 గెలిచిన సన్‌రైజర్స్
- నేటి మ్యాచ్‌లో పేవరెట్ చెన్నై
- తగ్గదేల్యా అంటున్న ఆరెంజ్ ఆర్మీ
- ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే
చెన్నై: ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు చెన్నై వేదికగా ధోని సారథ్యంలోని చెన్నె సూపర్ కింగ్స్ (CSK)తో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)తో తలపడనుంది. లీగ్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సొంతం చేసుకున్న సీఎస్కే టీం.. పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉండగా.. 5 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం రెండు మ్యాచ్‌లు గెలిచి టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం SRHకు ఎంతో కీలకం కానుంది.
SRH టీమ్

ఈ ఐపీఎల్‌ను రెండు వరుస ఓటములతో మొదలెట్టిన SRH.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లను కంగు తినిపించింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పేలవ బ్యాటింగ్‌తో చేజార్చుకుంది. దాంతో చెన్నైతో జరిగే మ్యాచ్.. హైదరాబాద్‌కు చావోరేవోగా తయారైంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్ కచ్చితంగా గెలవాల్సిందే.
చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో లోకల్ భాయ్ వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే బంతితో మాయ చేసే అవకాశముంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రాణిస్తుండగా.. ఇతర బౌలర్లు విఫలమవుతున్నారు. మార్కో జాన్సెన్ వికెట్లు తీసినా.. పరుగులు కట్టడి చేయలేకపోతున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. టాప్-5 బ్యాటర్లలో ఏ ముగ్గురు రాణించినా సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.
CSK టీమ్

ఇక నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై నాలుగో విజయంపై కన్నేసింది. స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ అందుబాటులోకి రావడంతో చెన్నై శిబిరంలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. చెన్నై విజయాల్లో బ్యాటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు జోరుమీదున్నారు. ఆరంభ మ్యాచ్‌లలో రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో సంచలనాలను సృష్టించాడు. ఇక కాన్వే కూడా దూకుడుగా ఆడుతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై ఓపెనర్లపై భారీ ఆశలు పెట్టుకుంది.
అజింక్య రహానె, శివమ్ దూబే

మరోవైపు టీమ్ ఇండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానె, శివమ్ దూబేలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశమే. మహీశ్ తీక్షణ, జడేజా, మోయిన్ అలీ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక హైదరాబాద్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

చెన్నై సూపర్ కింగ్స్

సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో మాత్రమే అంబటి రాయుడిని ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వాడుతున్నారు. వారు మొదట బౌలింగ్ చేస్తే రెండో బౌలర్‌గా అతనిని మార్చుకుంటారు.
మొత్తంగా CSK ఫైనల్ XII ఇలా ఉండొచ్చు: 1 రుతురాజ్ గైక్వాడ్, 2 డెవాన్ కాన్వే, 3 అజింక్యా రహానే, 4 శివమ్ దూబే, 5 అంబటి రాయుడు, 6 మొయిన్ అలీ, 7 రవీంద్ర జడేజా, 8 MS ధోని (కెప్టెన్ & wk), 9 తుషార్ దేశ్‌పాండే, 10 మహేశ్, 10 మహేశ్ పతిరానా/మిచెల్ సాంట్నర్, 12 ఆకాష్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒకే ఆటగాడిని ఉపయోగించడం లేదు. అయితే ఇది సాధారణంగా బౌలర్‌కు లేదా వైస్ వెర్సా కోసం బ్యాటర్‌గా ఉంటుంది. నైట్ రైడర్స్‌కి వ్యతిరేకంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా హ్యారీ బ్రూక్ వంద పరుగులు చేసాడు. తరువాతి మ్యాచులో, వాషింగ్టన్ సుందర్‌ని తీసుకున్నారు. ముంబైతో జరిగిన తర్వాతి గేమ్‌లో వారు బౌలింగ్ పూర్తి చేసి, అబ్దుల్ సమద్‌ను చేజింగ్‌కు తీసుకున్నారు. టి నటరాజన్‌ను పక్కనబెట్టారు.
సన్‌రైజర్స్ ఫైనల్ XII ఇలా ఉండొచ్చు : 1 హ్యారీ బ్రూక్, 2 మయాంక్ అగర్వాల్, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), 5 అభిషేక్ శర్మ, 6 హెన్రిచ్ క్లాసెన్ (వారం), 7 అబ్దుల్ సమద్, 8 వాషింగ్టన్ సుందర్, 9 భువనేశ్వర్ కుమార్, 10 మార్కో జాన్సెన్/అకెరల్ హోసేన్/ఆదిల్ రషీద్, 11 మయాంక్ మార్కండే, 12 టి నటరాజన్/వివ్రాంత్ శర్మ
గణాంకాలు
- CSKపై 10 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీ చేయని ఏకైక ఆటగాడు మయాంక్ అగర్వాల్
- గత రెండు ఐపీఎల్ సీజన్లలో, సన్‌రైజర్స్‌పై రుతురాజ్ గైక్వాడ్ చేసిన 235 పరుగుల కంటే నితీష్ రాణా, సంజూ శాంసన్ మాత్రమే ఎక్కువ పరుగులు చేశారు.
- తుషార్ దేశ్‌పాండే ఈ సీజన్‌లో చివరి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు పడగొట్టాడు, ఇది ఫాస్ట్ బౌలర్‌లో రెండవ అత్యధిక వికెట్లు. అయితే, ఈ దశలో అతని ఎకానమీ 12.81 కనీసం 30 బంతులు వేసిన బౌలర్లలో అత్యధికం.
- భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో 103 బంతుల్లో ఆరుసార్లు అజింక్య రహానెను అవుట్ చేసి, కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు.
పిచ్ పరిస్థితులు

చెన్నైలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లు స్పిన్నర్లకు సరిపోయేంత మంచి బ్యాటింగ్ ట్రాక్‌లను కలిగి ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్లు బాగా పరులిస్తారు. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగించవచ్చు. వాతావరణం వేడిగా, గాలిలో తేమ కూడా ఉంటుందని భావిస్తున్నారు.