ప్రధానాంశాలు
- నేడు గుజరాత్‌తో… లక్నో ఢీ
- 6మ్యాచ్‌లు ఆడిన లక్నో 4 గెలిచింది
- 5 మ్యాచ్‌లు ఆడి 3 గెలిచిన గుజరాత్
- స్పిన్ విభాగంలో లక్నో బలంగా ఉంది
- ‘రషీద్ ఖాన్’పై ఆధారపడుతున్న GT
లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) శనివారం, ఏప్రిల్ 22న ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన లక్నో నాలుగింటిలో విజయం సాధించింది. అంతేగాక పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో చాలా బలంగా ఉంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ మేయర్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. స్టోయినిస్, అయూష్ బడోని, నికోలస్ పూరన్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. చరిత్ర టైటాన్స్ వైపే ఉన్నా… లక్నో స్పిన్నర్లను వారి సొంత మైదానంలో ఎదుర్కోవడం చాలా కష్టం.

ఈ సీజన్‌లో లక్నో గుజరాత్ టైటాన్స్ కంటే స్పిన్ విభాగంలో లక్నో మంచి బలంగా ఉంది. గుజరాత్ జట్టు ఈ సీజన్‌లో కేవలం ఒక స్పిన్నర్ – రషీద్ ఖాన్ -పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఆ జట్టు పేస్ అటాక్‌ను ఎక్కువగా నమ్ముకుంది. దీంతో నేటి మ్యాచ్ కోసం స్లో పిచ్ ఎంచుకోవచ్చు. ఈ రెండు జట్లు చివరిసారి తలపడినప్పుడు రషీద్ నాలుగు వికెట్లతో సూపర్ జెయింట్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఐపిఎల్ 2023లో రషీద్ అంతగా తనదైన శైలిలో లేకపోయినా, అతను వికెట్ల జాబితాలో ముందున్నాడు: గత సీజన్‌లో 20.1తో పోలిస్తే ఈ సీజన్‌లో 10.9 స్ట్రైక్ రేట్. కాగా ఐపిఎల్ కెరీర్ స్ట్రైక్ రేట్ 18.8.
ఇతర స్పిన్నర్లలో ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్ నూర్ అహ్మద్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాడు. అక్కడ అతను 2.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రాహుల్ తెవాటియా ఈ సీజన్‌లో ఒక్క డెలివరీ కూడా వేయలేదు.
వుడ్ అనారోగ్యంతో సూపర్ జెయింట్స్ యొక్క చివరి గేమ్‌లో ఆడలేదు. ఒక వేళ అతను ఆడితే టైటాన్స్ జట్టుకు వ్యతిరేకంగా వారు ఏ విధమైన ట్రాక్‌ను సిద్ధం చేస్తారో కూడా నిర్ణయించవచ్చు.
మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్, ఉనద్కట్, కృష్ణప్ప గౌతమ్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతోపాటు సొంత గడ్డపై ఆడుతుండడం కూడా లక్నోకు సానుకూల పరిణామమే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో లక్నో ఉంది.
గుజరాత్ టీమ్

ఇక గుజరాత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. షమి, రషీద్ ఖాన్, జోసెఫ్, విజయ్ శంకర్‌లతో గుజరాత్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేనకు కూడా గెలుపు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.
ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేస్తే… ఆయుష్ బడోనితో ప్రారంభించి, మిశ్రా కోసం అతనిని లేదా కైల్ మేయర్‌లను ఉపసంహరించుకుంటుంది. బ్యాటింగ్ బలాన్ని పెంచడానికి కె గౌతమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించవవచ్చు. మొదట బౌలింగ్ చేస్తున్నప్పుడు, మిశ్రా ప్రారంభిస్తాడు. వారు బ్యాటింగ్ చేసినప్పుడు బడోని ప్రత్యామ్నాయంగా వస్తాడు.
లక్నో ఫైనల్ XII జాబితా ఇలా ఉండొచ్చు: 1 KL రాహుల్ (కెప్టెన్), 2 కైల్ మేయర్స్/క్వింటన్ డి కాక్, 3 దీపక్ హుడా, 4 కృనాల్ పాండ్యా, 5 మార్కస్ స్టోయినిస్, 6 నికోలస్ పూరన్ (WK), 7 ఆయుష్ బడోని, 8 యుధ్వీర్ సింగ్, 9 రవి బిష్ణోయ్, 1 అవేష్ ఖాన్, 11 నవీన్-ఉల్-హక్/మార్క్ వుడ్, 12 అమిత్ మిశ్రా
గుజరాత్ టైటాన్స్
టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో ప్రారంభించవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో జోష్ లిటిల్ లేదా నూర్‌లలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా రానున్నారు. అయితే, వారు ఛేజింగ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగే అవకాశముంది.
టైటాన్స్ ఫైనల్ XII జాబితా ఇలా ఉండొచ్చు : 1 శుభ్‌మన్ గిల్, 2 వృద్ధిమాన్ సాహా (వికె), 3 బి సాయి సుదర్శన్, 4 హార్దిక్ పాండ్యా (కెప్టెన్), 5 డేవిడ్ మిల్లర్, 6 రాహుల్ తెవాటియా, 7 విజయ్ శంకర్, 8 రషీద్ ఖాన్, 9 అల్జారీ జోసెఫ్, 10 మహ్మద్ షమీ, 11 మోహిత్ శర్మ, 12 జోష్ లిటిల్/నూర్ అహ్మద్
గణాంకాలు
- హార్దిక్ రెండు మ్యచుల్లో కృనాల్‌తో తలపడ్డాడు, రెండూ గత సంవత్సరం IPLలో ఆడినవే. ఆడిన 13 బంతుల్లో ఒకసారి ఔట్ అయి, పది పరుగులు చేశాడు.
- రషీద్‌పై నికోలస్ పూరన్ స్ట్రైక్ రేట్ అత్యల్పంగా ఉంది.
- సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో చివరి ఐదు ఓవర్లలో 19 వికెట్లు పడగొట్టింది, ఇది ఏ జట్టుకైనా అత్యధికం. ఈ దశలో వారి ఎకానమీ 9.7 లీగ్‌లో ఉమ్మడిగా రెండవది.