ప్రేమ అనేది మానవ జీవితాలకు అపారమైన ఆనందాన్ని కలిగించే ఒక అందమైన అనుభూతి. ప్రేమించి పెళ్లి చేసుకొని, తరువాత విడిపోతే ఆ బాధ మాములుగా ఉండదు. కొంతమంది క్రికెటర్లు సంవత్సరాలుగా తమ సంబంధాలు, వివాహాలను కొనసాగించగలిగితే, మరికొందరు ఆ అదృష్టానికి దూరమయ్యారు. విడాకులు అనేది బాధాకరమైన, సవాలుతో కూడుకున్న అనుభవం. ఆ వ్యక్తులు క్రికెటర్లు అయితే తరచుగా బహిరంగ చర్చకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితే మన టీమిండియా క్రికెటర్లకు ఎదురైంది.
1. భారత క్రికెటర్ శిఖర్ ధావన్, అయేషా

భారత క్రికెటర్ శిఖర్ ధావన్, కిక్‌బాక్సింగ్ స్టార్ అయేషా ముఖర్జీ విడిపోతున్నట్లు చేసిన ప్రకటన పలువురిని షాక్‌కు గురి చేసింది. మెల్‌బోర్న్‌లో ఉన్న అయేషా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఏషా ముఖర్జీ’లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ జంట 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయేషాకు ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధావన్ కంటే అయేషా వయసులో 10 సంవత్సరాలు పెద్దది. మొన్నటివరకు ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అయితే అయేషా ముఖర్జీ తన భర్త శిఖర్ ధావన్ నుండి విడాకులు తీసుకున్నామని చేసిన ప్రకటన అభిమానులు విస్తుపోయారు.
గతంలో పలువురు భారత క్రికెటర్లు విడాకుల బాట పట్టారు.
2. అజారుద్దీన్, భార్య నౌరీన్

1996లో ప్రముఖ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకోవడానికి వీలుగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తన భార్య నౌరీన్‌కు విడాకులు ఇచ్చాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, అతను బిజ్లానీకి కూడా విడాకులు ఇచ్చాడు.
అజారుద్దీన్, సంగీతా బిజ్లానీ

3. వినోద్ కాంబ్లీ, నోయెల్లా లూయిస్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్‌ను వివాహం చేసుకున్నాడు.
వినోద్ కాంబ్లీ, ఆండ్రియా హెవిట్

అయితే ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహం చేసుకున్నాడు.
4. జవగల్ శ్రీనాథ్, జ్యోత్స్న

భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్, 2008లో మాధవి పాత్రావళి అనే జర్నలిస్టును వివాహం చేసుకోవడానికి వీలుగా తన మొదటి భార్య జ్యోత్స్నకు విడాకులు ఇచ్చాడు.
జవగల్ శ్రీనాథ్, మాధవి పాత్రావళి

5. దినేష్ కార్తీక్, నికితా వంజారా

ప్రముఖ భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు, 2012లో, తోటి క్రికెటర్ మురళీ విజయ్‌తో నికితా రిలేషన్‌షిప్‌లో ఉందన్న షాకింగ్ న్యూస్ కార్తీక్‌కు అందింది. దీంతో కార్తీక్ నికితాతో విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రఖ్యాత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.
6. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్

యోగరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్, క్రికెట్ పిచ్‌పై తన సొంత విజయాలకే కాదు, తోటి క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రిగా కూడా పేరు పొందాడు. అయితే, యోగరాజ్ వ్యక్తిగత జీవితంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి.
యోగరాజ్‌కి గతంలో షబ్‌మన్‌తో వివాహం జరిగింది, అయితే ఈ జంట తరువాత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. యోగరాజ్ చివరికి సత్వీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు విక్టర్, అమర్జీత్ కౌర్ ఉన్నారు.
కుటుంబ సంబంధాలు సవాలుగా మారినప్పటికీ, యోగరాజ్ క్రికెట్ ప్రపంచంలో చురుకుగా కొనసాగుతూనే ఉన్నాడు. నటనా వృత్తిని కూడా కొనసాగిస్తున్నాడు.