23.7 C
Hyderabad
Sunday, July 27, 2025

Buy now

spot_img

భారతీయ క్రికెటర్లు… వారి వ్యక్తిగత నమ్మకాలు!

భారతదేశంలో క్రికెట్ ఓ ఆట మాత్రమే కాదు, అది ఓ ఏమోషన్. భారత క్రికెటర్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనలతోనే కాకుండా వారి వ్యక్తిగత విశ్వాసాలకు కూడా ప్రసిద్ధి కెక్కారు. వారి వ్యక్తిగత నమ్మకాలు వారి జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి అభిమానులను  కూడా అలరించడం విశేషం.

ప్రధానాంశాలు:

  • మన దేశంలో క్రికెట్ ఓ ఏమోషన్
  • క్రికెటర్లకు వ్యక్తిగత నమ్మకాలు ఎక్కువే
  • సచిన్ మ్యాచ్ తరువాత కూడా ప్రాక్టీస్
  • ధోనీకి బైక్‌పై తిరగడం అలవాటు
  • మ్యాచ్ తరువాత కోహ్లీ స్నానం చేస్తాడు
  • రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దంగా కూర్చుంటాడు

భారతదేశంలో క్రికెట్ ఓ ఆట మాత్రమే కాదు, అది ఓ ఏమోషన్. భారత క్రికెటర్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనలతోనే కాకుండా వారి వ్యక్తిగత విశ్వాసాలకు కూడా ప్రసిద్ధి కెక్కారు. వారి వ్యక్తిగత నమ్మకాలు వారి జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి అభిమానులను  కూడా అలరించడం విశేషం.

ఈ సోషల్ మీడియా యుగంలో, భారతీయ క్రికెటర్లు కూడా లక్షలాది మందికి రోల్ మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మారారు. వీరిని ముఖ్యంగా యువ తరం ఎక్కువగా క్రికెటర్లను ఫాలో అవుతుంది.  తద్వారా క్రికెట్ మైదానం వెలుపల వారు చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో భారతీయ క్రికెటర్ల వ్యక్తిగత విశ్వాసాలను ఈ కథనంలో చూద్దాం.

1. సచిన్ టెండూల్కర్

 

Source: twitter

“క్రికెట్ దేవుడు” సచిన్ టెండూల్కర్, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా తన షాట్‌లను ప్రాక్టీస్ చేసే అలవాటు ఉంది.  నెట్స్‌లో గంట లేదా అంతకంటే ఎక్కువసేపు తన షాట్‌లను ప్రాక్టీస్ చేసేవాడు.

 2. ఎంఎస్ ధోని

 

Source: Twitter

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బైక్‌లంటే చాలా ఇష్టం. మ్యాచ్ తర్వాత, విశ్రాంతి తీసుకోవడానికి బదులు తన బైక్‌పై స్టేడియం చుట్టూ తిరగడం అంటే ఇషం.

3. విరాట్ కోహ్లి

 

Source: Crcwadi.com

భారత  మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ తర్వాత ఎవరినైనా కలిసే ముందు స్నానం చేసి బట్టలు మార్చుకునే ప్రత్యేక అలవాటు ఉంది.  తలస్నానం చేయడం వల్ల నెగటివ్ థింక్ వదిలేసి కొత్తగా ప్రారంభించవచ్చని అతను నమ్ముతాడు.

4. రోహిత్ శర్మ

 

Source: Instagram

భారత ఓపెనర్ రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత కొన్ని నిమిషాల పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. ఇది ప్రశాంతంగా ఉండటానికి, తిరిగి  పని ఆరంభించడానికి సహాయపడుతుందని అతను నమ్ముతాడు. 

5. యువరాజ్ సింగ్

 

Source: Instagram

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మ్యాచ్ తర్వాత తన జెర్సీని తీసి యువ అభిమానికి ఇస్తాడు. ఇది జట్టుకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, యువ అభిమానులను క్రికెట్‌లోకి తీసుకువచ్చేలా ప్రేరేపించగలదని అతను నమ్ముతాడు.

6.రవిచంద్రన్ అశ్విన్

 

Source: Twitter

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆట ముగిసిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగడం అలవాటు చేసుకున్నాడు. ఒక కప్పు కాఫీ విశ్రాంతి తీసుకోవడానికి, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుందని అతను నమ్ముతాడు.

7. హార్దిక్ పాండ్యా

 

Source: Instagram

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మెడలో ఎప్పుడూ ఓ బంగారు గొలుసు ధరిస్తాడు. మ్యాచ్ తర్వాత ప్రత్యేకంగా దాన్ని ముద్దాడతాడు. ఆ గొలుసు తనకు అదృష్టాన్ని తెస్తుందని, మైదానంలో మెరుగ్గా రాణించడంలో సహాయపడుతుందని పాండ్యా నమ్మకం.

8. రవీంద్ర జడేజా

 

Source: Instagram

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వికెట్ తీసిన తర్వాత తన ప్రత్యేకమైన కత్తి విన్యాసాలకు ప్రసిద్ధి చెందాడు. కర్రసాము తరహాలో కత్తిని గిరగిరా తిప్పడం మైదానంలో అతన్ని మిగతా ఆటగాళ్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. 

9. జస్ప్రీత్ బుమ్రా

 

Source: Instagram

: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వికెట్ తీసుకున్న తర్వాత స్టంప్‌లు సేకరించడం అలవాటు. అతను స్టంప్‌లను  (సావనీర్‌) గుర్తుగా సేకరించి  తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు.

10. శిఖర్ ధావన్

 


source: Instagram

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీతో సెల్ఫీ దిగడం మ్యాచ్ అనంతరం అలవాటు. ఈ క్షణాన్ని ఆస్వాదించడానికి ఈ అలవాటు  సహాయపడుతుందని అతను నమ్ముతాడు.

11. అజింక్య రహానే

 

Source: Instagram

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానేకు మ్యాచ్ తరువాత బిస్కెట్‌లతో ఒక కప్పు చాయ్ (టీ) తాగే ప్రత్యేకమైన అలవాటు ఉంది. టీ, బిస్కెట్లు తీసుకోవడం వల్ల మంచి విశ్రాంతి దొరుకుతందని అతని నమ్మకం.

12. భువనేశ్వర్ కుమార్

 

Source: Instagram

భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు ఆట ముగిసిన వెంటనే స్నానం చేయడం అలవాటు. తలస్నానం చేయడం వల్ల చెమట, అలసట తొలగిపోతుందని, తదుపరి గేమ్‌కు తనను తాజాగా ఉంచుతుందని అతను నమ్ముతాడు.

మొత్తంమీద, ఈ మ్యాచ్ పూర్తయ్యాక భారతీయ క్రికెటర్ల నమ్మకాలు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఈ చిన్న అలవాట్లు వారి ఆటలో భాగమై, క్రికెటర్లుగా వారి విజయానికి ఎలా దోహదపడుతున్నాయో చదివాం కదా. మరిన్ని  ఆసక్తికర విశేషాలతో మళ్లీ కలుద్దాం  బై…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles