23.2 C
Hyderabad
Thursday, July 24, 2025

Buy now

spot_img

ఐపీఎల్ క్రికెటర్లు… స్ఫూర్తిదాయక గాథలు!

ఆర్థికంగా అట్టడుగున ఉండి... ఐపిఎల్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్న కొంతమంది   క్రికెటర్లు కొందరు ఉన్నారు.  ఆ క్రికెటర్లు తమ కృషి, పట్టుదల ద్వారా ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో నిలిచారు.  ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఎదిగేందుకు  IPL  అద్భుతంగా దోహదపడింది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం....

ప్రధానాంశాలు

  • IPL ఒక సంపన్నమైన క్రికెట్ లీగ్‌
  • ఐపీఎల్ పేద క్రికెటర్ల జీవితాన్ని మార్చేసింది
  • ఐపీఎల్‌తో ఆర్థికంగా ఎదిగిన క్రికెటర్లు
  • సిరాజ్, పాండ్యా బ్రదర్స్
  • చేతన్ సకారియా, నట్టూ, రింకూ సింగ్

Sportz365 డెస్క్:    IPL ప్రారంభంతో డబ్బు సంపాదించడానికి ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సిన రోజులు పోయాయి. IPL ఒక సంపన్నమైన లీగ్‌గా మారడంతో   క్రికెటర్ల సంపాదన విధానాన్ని మార్చింది, 

ఆర్థికంగా అట్టడుగున ఉండి… ఐపిఎల్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్న కొంతమంది   క్రికెటర్ల విశేషమైన కథనాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం.  ఆ క్రికెటర్లు తమ కృషి, పట్టుదల ద్వారా ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో నిలిచారు.  ఒక్క ఐపీఎల్ ఎడిషన్ ఈ క్రికెటర్ల జీవితాన్ని మార్చేసింది.  ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఎదిగేందుకు  IPL  అద్భుతంగా దోహదపడింది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం….

1. మహ్మద్ సిరాజ్ 

Source: ESPN

మహ్మద్ సిరాజ్ దిగువ మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చాడు. తండ్రి ఆటోరిక్షా డ్రైవర్ అయినప్పటికీ, భారత క్రికెట్ జెర్సీని ధరించాలనే  లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఈ కలను సాధించే దిశగా అతను సాగించిన ప్రయాణం అంత తేలికైనది కాదు, ఎందుకంటే అతను క్రికెట్ కిట్ కొనుగోలు చేయడానికి అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది.

మొదట్లో టెన్నిస్ బాల్ క్రికెట్‌లో త్వరగా పేరు తెచ్చుకున్న సిరాజ్‌లోని ప్రతిభ…  ఆట పట్ల అంకితభావం చిన్నప్పటి నుండి స్పష్టంగా కనిపించాయి. కొద్ది కొద్దిగా సిరాజ్ తన నైపుణ్యాలను బాగా మెరుగుపరుచుకున్నాడు.  అరంగేట్రం రంజీ సీజన్‌లో కేవలం 9 మ్యాచుల్లో 41 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ సమయంలో అతను ప్రస్తుత భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మార్గదర్శకత్వంలో బాగా రాటుదేలాడు.  భరత్ అరుణ్ సిరాజ్  పేస్ బౌలింగ్‌ను చక్కదిద్దడంలో ఇతోధికంగా సహాయం చేశాడు.

2017లో, IPL వేలంలో SRH ఫ్రాంచైజీ  2.6 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేయడంతో సిరాజ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అతని పేస్ బౌలింగ్ పరాక్రమం వివిధ ఫ్రాంచైజీలకు తెలిసింది.

క్లబ్ మ్యాచ్‌ల నుండి రూ. 500 అరకొర ఆదాయం నుండి…  దేశానికి ఎలైట్ పేసర్‌గా మారడం వరకు, సిరాజ్ జీవితాన్ని మార్చే కథ అతని కృషి,పట్టుదలకు నిదర్శనం. ఈ మార్గంలో సిరాజ్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన లక్ష్యంపై దృష్టి సారించాడు. చివరికి ఆస్ట్రేలియాపై వారి సొంత మైదానంలో టీంఇండియా చారిత్రాత్మక విజయంలో కీలక భాగస్వామిగా నిలిచాడు. 

సిరాజ్ ఈ స్థితికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ నుండి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వరకు అతని ప్రయాణం చెప్పుకోదగ్గది ఏమీ కాదు. ఇది చాలా మంది యువ క్రికెటర్లకు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రేరేపించింది.

సిరాజ్ విజయగాథ యువ క్రికెటర్లకు ఎంతో స్పూర్తిదాయకం. ముఖ్యంగా పేదరికం నేపథ్యాల నుండి వచ్చే యువ క్రికెటర్లకు. సిరాజ్ లోని సహజ ప్రతిభ అతని విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, భరత్ అరుణ్ వంటి అనుభవజ్ఞులైన కోచ్‌ల మార్గదర్శకత్వం అతనికి లభించడం అదృష్టం.   అతని నైపుణ్యాలను చక్కదిద్దడంలో, సామర్థ్యాన్ని పెంచుకోవడంలో సిరాజ్‌కు సహాయపడింది.

అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, సిరాజ్ యొక్క అచంచలమైన సంకల్పం, కృషి చివరికి ఫలించాయి . అతను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రికెట్ అభిమానులకు ప్రేరణగా నిలిచాడు. ప్రసుత్తం ఐపీఎల్ సీజన్‌లో పర్చుల్ క్యాప్ దిశగా దూసుకుపోతున్నాడు.

2. పాండ్యా బ్రదర్స్

Source: Instagram

పాండ్యా సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన ప్రసిద్ధ భారతీయ క్రికెటర్లు. అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాలనే వారి సమిష్టి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తండ్రి వ్యాపారంలో నష్టాలొస్తే  తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అదనపు నగదు సంపాదించడానికి స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లలో ఆడవలసి వచ్చింది.

ఆర్థిక ఇబ్బందులు వారి క్రికెట్ కెరీర్‌ను కూడా ప్రభావితం చేశాయి. డబ్బు ఆదా చేయడానికి ఒక రోజు మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌తో జీవించవలసి వచ్చిందని హార్దిక్ పాండ్యా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ప్రారంభంలో సోదరులు ఇద్దరు బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సరైన క్రికెట్ కిట్ లేకపోవడంతో ఒక బ్యాట్‌తో ఆడాల్సి వచ్చేది.

ఇన్ని సవాళ్లు ఎదురైనా పాండ్యా సోదరులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. 2015లో ముంబై ఇండియన్స్ జట్టు రూ. రూ. 15 లక్షల బేస్ ప్రైస్ తో  తీసుకుంది. . మరుసటి సంవత్సరం, కృనాల్ 2016 వేలంలో అదే ఫ్రాంచైజీ  2కోట్లకు ఒప్పందం కుదర్చుకుంది.

హార్దిక్, కృనాల్ పాండ్యా తమ కెరీర్ మొదలుపెట్టిన రోజులు ఇంకా మరచిపోలేదు. యువ ఔత్సాహిక క్రికెటర్లకు రోల్ మోడల్‌లుగా కొనసాగుతున్నారు. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ కలలను సాకారం చేసుకోవచ్చని వీరు నిరూపించారు.

పాండ్యా బ్రదర్స్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చాలా మంది యువకులను వారి అభిరుచి మేరకు క్రికెట్ కొనసాగించేలా చేసింది. వారి కలలను ఎప్పటికీ వదులుకోలేదు. పాండ్య సోదరుల విజయ గాథ మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకం.

3. చేతన్ సకారియా

Source: Instagram

 గుజరాత్ లోని రాజకోట్‌కు సుమారు 180 కిలోమీటర్లో దూరంలో గల ఒక చిన్న పల్లెటూరు వర్తెజ్ లో జన్మించిన సకారియా… క్రికెటర్ అయ్యే క్రమంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. 16 ఏళ్ల వయసు వరకు కూడా సకారియా టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడే వాడు.  ఈ క్రమంలో 2015లో జరిగిన కూచ్ బెహర్ ట్రోఫీ ద్వారా అందరినీ తన వైపు చూసేలా చేసుకున్నాడు. 6 మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీసీ ఔరా అనిపించాడు. ఒక రకంగా ఈ ప్రదర్శన సకారియాలో నమ్మకాన్ని మరింత పెంచింది. కూచ్ బెహర్ లో అద్భుతంగా రాణించడంతో సకారియాకు ఎంఆర్ ఎఫ్ పేస్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ లభించింది.  దాంతో సకారియా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకునే అవకాశం దక్కింది.  ఇల్లు గడవడం కోసం ఒక పక్క క్రికెట్  ప్రాక్టీస్ చేస్తూనే సకారియా తన మేనమామ దగ్గర పనిచేేసేవాడు. 

2020 ఐపీఎల్ లో సకారియా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నెట్ బౌలర్ ఉన్నాడు.2021లో జరిగిన వేలంలో సకారియాను రూ. 1.2 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. 2021వ సంవత్సరం సకారియాకు ఎంతటి మధుర జ్ఞాపకాలను మిగిల్చిందో అదే సమయంలో చేదు జ్ఞాపకాలను కూడా రుచి చూపించింది.

 2021 ఐపీఎల్ వేలానికంటే ముందు సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సకారియాకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అదే ఏడాది మేలో సకారియా తండ్రి కూడా మరణించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సకారియాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది.

క్రికెటర్ అవ్వాలనుకుంటే సరిపోదు అందు కోసం తీవ్రంగా శ్రమించాలి. కలను సాకారం చేసుకునే క్రమంలో ఎదరుయ్యే ఇబ్బందులను అధిగమించి విజేతగా నిలవాలి. ఇండియన్ యంగ్ బౌలర్ సకారియా జీవితం కూడా ఇదే చెబుతుంది. మనలో ప్రతిభ, పట్టుదల ఉంటే చాలు టీమిండియా జెర్సీ వేసుకోవచ్చని అతడి కథ నిరూపిస్తుంది.

4. టి.నటరాజన్

Source{ Twitter

2021లో ఆస్ట్రేలియాతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో అనూహ్యంగా మూడు ఫార్మాట్లలోకీ అరంగేట్రం చేసిన నటరాజన్.. భారత్ తరఫున ఇలా ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. అయితే నటరాజన్ క్రికెట్ ప్రస్థానాన్ని గమనిస్తే అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి పడ్డ బాధలు ఎన్నో..

నటరాజన్ 20 సంవత్సరాల వయస్సు వరకు టెన్నిస్-బాల్ క్రికెట్ ఆడాడు. అసలు ప్రాక్టీస్ చేసేందుకు సరైన వసతున్న క్రికెట్ మైదానంలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. సేలం నుండి 36 కి.మీ దూరంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన నటరాజన్ ఐదుగురు తోబుట్టువులలో పెద్దవాడు. చిన్న టీ దుకాణం నడుపుతున్న తన కుటుంబాన్ని పోషించడానికి వార్తాపత్రికలు అమ్మడం, ఇళ్లకు  పాల ప్యాకెట్లు వేయడం  వంటి కూలిపనులు చేశాడు.

నటరాజన్ యొక్క టెన్నిస్-బాల్ క్రికెట్ నైపుణ్యాలు అతనికి స్థానిక టోర్నమెంట్‌లలో చోటు సంపాదించిపెట్టాయి.  2010-11లో డివిజనల్ TNCA మ్యాచ్‌లలో ఆడేందుకు ఎంపికయ్యాడు.  నాణ్యమైన యార్కర్లను ఎలా వేయాలో టెన్నిస్-బాల్ క్రికెట్ ఆడటం ద్వారా నేర్చుకున్నాడు. నటరాజన్‌లోని ఈ సామర్థ్యం అతణ్ని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జట్టు జాలీ రోవర్స్ తరుపున ఆడేందుకు అవకాశం కల్పించింది. 

ఏది ఏమైనప్పటికీ, నటరాజన్ తమిళనాడు యొక్క రంజీ జట్టులోకి ప్రవేశించాక అతని బౌలింగ్ యాక్షన్ సరిగా లేదనే కారణంతో  రెండేళ్లపాటు పక్కన పెట్టింది. BCCI అధికారుల సహాయంతో, అతను తన బౌలింగ్ యాక్షన్ సరిదిద్దుకోగలిగాడు. IPL 10లో, అతణ్ని పంజాబ్ ఫ్రాంచైజీ  3 కోట్ల రూపాయలకు వేలంలో కొనుక్కుంది. 

క్రికెట్ ఆడేందుకు ఎలాంటి  సౌకర్యాలు లేని చిన్న గ్రామంనుండి … కష్టపడి, ఆహోరాత్రులు శ్రమించి, నేడు యార్కర్ స్పెషలిస్ట్ గా  మారడం అనేది ప్రతి వర్థమాన క్రీడాకారుడికి ఓ స్ఫూర్తి. 

5. రింకూ సింగ్… క్రికెట్ ప్రయాణం

Source: Twitter

రింకు సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన 26 ఏళ్ల భారతీయ క్రికెటర్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్. రింకు సింగ్ పదవ తరగతి పూర్తి చేసాక ప్రొపెషనల్  క్రికెటర్‌గా జీవితాన్ని ఆరంభించాడు.

ప్రస్తుతం రింకు సింగ్ పేరు KKR లో బాగా తెలిసిననప్పటికీ, క్రికెట్ ఆడాలనే అతని కలను కొనసాగించడానికి అనేక కష్టాలు, ఎదురుదెబ్బలు తిన్నాడు. తండ్రి ఎల్‌పిజి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉద్యోగం, అతని సోదరుడు ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేసేవాడు. తన కుటుంబాన్ని పోషించడానికి  రింకూ సింగ్ సైతం ఇంటి పని చేసే పనివాడు.

2016-17 సీజన్‌లో రింకూసింగ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. వెంటనే అతని బేస్ ధర 10 లక్షలకు KXIP తీసుకుంది. 

రింకూసింగ్ 2018-19 రంజీ సీజన్‌లో తన రాష్ట్ర జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాక KKRనుంచి పిలుపు వచ్చింది. IPL 2018 మెగా వేలం సమయంలో, రింకు సింగ్‌ను 80 లక్షలకు  KKR తీసుకుంది. 

KKR అతనిని తదుపరి IPL సీజన్‌కు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నప్పటికీ రింకు సింగ్ క్రికెట్ పట్ల తన అభిరుచిని కొనసాగించడంలో చూపించిన  పట్టుదల ఔత్సాహిక ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఐపీఎల్ గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వరుసగా 5 సిక్సర్లు కొట్టిన KKRను గెలిపించాడు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles