ముంబయి: భారత జట్టు క్రికెటర్లు ఎడతెరిపిలేని షెడ్యూల్ కారణంగా తరచూ గాయాలపాలవుతున్నారు. ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్, పంత్ ప్రసిద్ధ కృష్ణ వంటి ఆటగాళ్ల గాయాలు ఇంకా తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలకు ప్లేయర్ వర్క్‌లోడ్‌ను ఎలా నిర్వహించాలనే దానిపై కొన్ని సూచనలను అందించామని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
అయితే ఈ మార్గదర్శకాలను ఆయా యాజమాన్యాలు కట్టుబడి ఉంటాయో లేదో ఖచ్చితంగా చెప్పలేమని రోహిత్ తెలిపాడు. గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించాలనే ప్రయత్నాల్లో ఆయా జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. దీంతో రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ సూచించాడు. 2023 IPL సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది.
మే 28న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల తర్వాత… ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7న ప్రారంభమవుతుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్‌మెంట్ ఫ్రాంఛైజీలకు కొన్ని మార్గదర్శకాలను తెలియజేసిందని, చివరికి అది జట్ల యాజమాన్యాలు, ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుందని రోహిత్ సూచించాడు.
ఎడతెరిపి క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయాలు తప్పవని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య తగిన విరామం తీసుకోవాలన్నాడు. శ్రేయస్ అయ్యర్ మాదిరిగానే అనుకోకుండా సంభవించే గాయాల కారణంగా ఆటగాళ్లు నిరాశకు గురవుతున్నారని, దీనిపట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆటగాళ్లను ఆదుకోవడానికి వారి గాయాలను తగ్గించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ తీవ్రంగా కృషి చేస్తోందని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ పూర్తి కథనం వీడియో లింక్
https://www.espncricinfo.com/story/rohit-sharma-on-workload-management-during-ipl-up-to-the-franchises-now-1364923