ప్రధానాంశాలు:
- పునరాగమనంలోనూ వీరులే
- ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కైవసం
- విమర్శకులను విస్మయానికి గురి చేసిన వైనం
- మెరుపులు మెరిపించిన రహానే, చావ్లా, మిశ్రా
sportz365 డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటి ఐపీఎల్. ఇందులో ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్‌లు ఎందరో పాలుపంచుకుంటారు. క్రికెట్ నైపుణ్యం,గ్లామర్ సమ్మేళనంతో IPL…. ఆటను విప్లవాత్మకంగా మార్చింది. సరిహద్దులు, సంస్కృతులకు అతీతంగా క్రికెట్‌కు ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించింది.
ఈ టోర్నమెంట్ యువ ఆటగాళ్లకు తమకంటూ ఒక పేరు తెచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తుండగా, అనేక మంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు పునరాగమనం చేయడం, ఇంత పెద్ద వేదికపై తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకున్న తీరు నభూతో…న భవిష్యతి. ఈ ఆటగాళ్ళు తమ నైపుణ్యాలను ప్రదర్శించడమే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – అవార్డులు గెలుచుకున్నారు. తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో వారికి వయస్సు, గాయాలు వంటి సవాళ్లకు ఎదురునిలిచారు. అభిమానుల్ని, విమర్శకులను విస్మయానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఈ ఐపీఎల్ టోర్నీలో పునరాగమనంలోనూ మెరుపులు మెరిపించిన రహానే, పియూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లపై ప్రత్యేక కథనం…
1. అజింక్యా రహానే (చెన్నై సూపర్ కింగ్స్)

గతంలో అజింక్యా రహానే టీ20 క్రికెట్‌లో వేగాన్ని అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఇటీవల అతను భారత టెస్ట్ జట్టు నుండి తొలగించారు. కానీ అజింక్య రహానే IPL 2023లో మెరుపులా దూసుకొచ్చాడు. పవర్‌ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 222.22 కావడం విశేషం. IPL సీజన్‌లో ఇది అత్యుత్తమమైనది.
IPL 2022లో Harmstring గాయం కారణంగా ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో 19.00 సగటు, 103.90 స్ట్రైక్ రేట్‌తో కేవలం 133 పరుగులు చేయగలిగాడు, IPL 2023 వేలంలో అతని బేస్ రేట్ INR 50 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ IPLలో సూపర్ కింగ్స్ ఆడిని మొదటి రెండు మ్యాచుల్లో రహానే తీసుకోలేదు. కానీ మొయిన్ అలీ కడుపు నొప్పితో పక్కకు తప్పుకున్న తర్వాత, రహానే రిజర్వ్ బెంచ్ నుండి టీంలోకి వచ్చాడు. పవర్‌ప్లేలో పేస్, స్పిన్ రెండింటిని దీటుగా ఎదుర్కొన్నాడు.
2. సందీప్ శర్మ (రాజస్థాన్ రాయల్స్)

2013 నుండి 2022 వరకు ప్రతి IPL సీజన్ ఆడిన తర్వాత, సందీప్ శర్మ ఇటీవలి వేలంలో అమ్ముడు పోలేదు. అయితే ఫ్రాక్చర్ కారణంగా ప్రసిధ్ కృష్ణ మొత్తం IPL 2023 నుండి వైదొలగడంతో సందీప్ అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌లో చేరాడు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లు వేయడంలో నమ్మదగిన బౌలర్‌గా ఉన్నాడు.
చెపాక్‌లో తన జట్టును గెలిపించేందుకు ధోనీ, జడేజాలకు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సందీప్ శర్మ యార్కర్లను వేశాడు. చెపాక్‌లో ధోనీకి వ్యతిరేకంగా చివరి ఓవర్‌లో 20 పరుగులను డిఫెండింగ్ చేసే పనిలో ఉన్న సందీప్ ఓవర్‌ను రెండు వైడ్‌లతో ప్రారంభించి, ఆపై బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్‌లను ఇచ్చాడు. అంతేకాదు ధోని, రవీంద్ర జడేజాలను బ్యాక్-టు-బ్యాక్ యార్కర్లతో పెద్ద షాట్లు ఆడకుండా అడ్డుకున్న వైనాన్ని యావద్దేశం కళ్లప్పగించి చూసింది. అంతేనా పవర్‌ప్లేలో రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేయడం ద్వారా చెన్నై జట్టు 175 పరుగులను చేయకుండా నిలువరించ గలిగాడు. మ్యాచ్ తర్వాత సందీప్ శర్మ మాట్లాడుతూ.. తాను నెట్స్ వద్ద తన యార్కర్లను బౌల్ చేస్తున్న తీరు తమ కెప్టెన్ సంజూ శాంసన్ గమనించి ఉండొచ్చు. బహుశా అందుకే ఆఖరి ఓవర్‌ని ‘కుల్దీప్ సేన్’కు ఇవ్వకుండా తనకు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.
CSK కోటను ఛేదించడంలో రాజస్థాన్ రాయల్స్‌కు సందీప్ సహాయం చేసిన తర్వాత, అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్‌ల కీలక వికెట్లు పడగొట్టాడు. తమ జట్టుకు మరో విజయానికి బాటలు వేశాడు.
3. పీయూష్ చావ్లా (ముంబై ఇండియన్స్)

2022లో జరిగిన మెగా వేలంలో పీయూష్ చావ్లాను ఏ ప్రాంఛైజీ పట్టించుకోలేదు. తదుపరి వేలంలో 34 ఏళ్ల చావ్లాను ముంబై ఇండియన్స్ తన బేస్ రేట్ 50 లక్షల కొనుగోలు చేసింది. చావ్లా ప్రస్తుతం ఈ సీజన్‌లో 7.15 ఎకానమీ రేటుతో ఐదు గేమ్‌లలో ఏడు వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ముంబై బౌలర్ అయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అరుణ్ జైట్లీ స్టేడియంలో రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండేల వికెట్లతో సహా 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వ్యతిరేకంగా చావ్లా తన లెగ్‌బ్రేక్‌లు, రాంగ్’అన్‌లను కూడా విసిరాడు. అక్కడ అతను అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌ల వికెట్లు తీసి వారి ఛేజింగ్‌ను అడ్డుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున పీయూష్ చావ్లా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.
4. అమిత్ మిశ్రా, (లక్నో సూపర్ జెయింట్స్)

చావ్లా మాదిరిగానే, అమిత్ మిశ్రా కూడా IPL 2022 మెగా వేలంలో అమ్ముడు పోలేదు. చావ్లా మాదిరిగానే, అతను ఈ సంవత్సరం తనలో టాలెంట్ ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అంతేకాదు ఫాస్ట్ లెగ్‌బ్రేక్స్, మిస్టరీ బాల్స్ వేయడంలోనూ ఆరితేరాడు.
40 ఏళ్ల మిశ్రా వేలంలో అత్యంత పాత ఆటగాడు, ఇక్కడ లక్నో సూపర్ జెయింట్స్ అతని బేస్ ధర INR 50 లక్షలకు తీసుకుంది. సూపర్ జెయింట్స్ అతనిని ఎకానా స్టేడియంలో బ్లాక్-సోయిల్ పిచ్‌మీద సన్‌రైజర్స్‌తో ఆడించింది. తన నాలుగు ఓవర్లలో 23 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. అతను సొంత మైదానంలో సూపర్ జెయింట్స్ కోసం ఒక తురుపుముక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి వారు బ్లాక్ సాయిల్ పిచ్‌లను ఉపయోగించడం కొనసాగిస్తూ, అదనంగా, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా మిశ్రా కూడా రహానే లాగా ఫీల్డ్‌లో కష్టపడాల్సిన అవసరం లేదు అతని బౌలింగ్ కోటా పూర్తయ్యాక హాయిగా డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు.
5. మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)

IPL 2023కి ముందు మోహిత్ శర్మ 2018వరకు IPL రెగ్యులర్‌గా ఆడాడు. 2014లో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. భారత క్రికెట్ జట్టులోనూ భాగంగా ఉన్నాడు.
గాయాలు మోహిత్ శర్మ కెరీర్‌ను నాశనం చేశాయి. అయితే IPL 2022లోఛాంపియన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో నెట్-బౌలింగ్ చేయడం అతని మార్గం సుగమం చేసింది. సూపర్ కింగ్స్‌లో మోహిత్‌తో కలిసి పనిచేసిన టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, అతను నెట్స్‌లో బౌలింగ్ చేసిన విధానానికి ఫిదా అయ్యాడు. టైటాన్స్ అతనిని IPL 2023 వేలంలో అతని బేస్ ధర INR 50 లక్షలకు కొనుగోలు చేసింది. KKR మ్యాచ్ చివరి ఓవర్‌లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్‌లతో యష్ దయాల్‌పై విరుచుకుపడ్డడంతో… శివమ్ మావి, ఆర్ సాయి కిషోర్ కంటే ముందే ఫైనల్ XIలోకి అడుగుపెట్టాడు.
మోహిత్ తన పునరాగమనాన్ని పంజాబ్ కింగ్స్‌కు వ్యతిరేకంగా ఘనంగా చాటాడు. ఆఫ్‌కట్టర్లు, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోయర్‌లతో ఆకట్టుకున్నాడు. ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్-విజేతగా నిలిచాడు.జితేష్ శర్మ, సామ్ కుర్రాన్ల వికెట్లు పడగొట్టి తన నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీని కంటే మెరుగైన కమ్‌బ్యాక్‌లు బహుశా ఊహించలేమేమో…!