ప్రధానాంశాలు
- నేడు KKR vs DC
- ఢిల్లీ బోణీ కొట్టేనా?
- డీసీ ఆటగాళ్ల బ్యాట్‌లు చోరీ
- ఈ మ్యాచ్‌లో గెలవాలన్న కసితో ఉన్న కేకేఆర్
- రెండు జట్లకు ఓపెనింగ్ సమస్య
న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 28వ లీగ్ మ్యాచ్‌లో KKRతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో నైనా గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంటోంది. అయితే గోరుచుట్టుపై రోకటి పోటులా బెంగళూరు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో చాలా మంది ఆటగాళ్లు తమ బ్యాట్‌లు, ఇతర సామగ్రిని పోగొట్టుకున్నారు.
ఢిల్లీ టీమ్

అసలు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ ఇంకా ఓ పట్టాన కుదురుకోలేదు. ఆ జట్టులో కెప్టెన్ వార్నర్ మాత్రమే రాణిస్తున్నాడు. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో వార్నర్ కూడా నిదానంగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టాపార్డర్ ఫెయిల్ కావడం ఆ జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఓపెనర్ పృథ్వీ షా ఫామ్ కోల్పోవడంతో ఢిల్లీ జట్టుకు అసలు శుభారంభమే కరువైంది.
మనీశ్ పాండే, మిచెల్ మార్ష్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, రోమన్ పొవెల్, రిలీ సోవ్, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్.. ఇలా మిడిలార్డర్ లో బ్యాటర్లను మారుస్తున్నా ప్రయోజనం మాత్రం లేదు. వార్నర్ తర్వాత అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. వార్నర్, అక్షర్‌కు తోడు మిగతా బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణిస్తేనే ఢిల్లీ భవితవ్యం బాగుంటుంది. అయితే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నాడు. తాము మిగతా మ్యాచుల్లో మెరుగ్గా రాణిస్తామంటున్నాడు.
KKR టీమ్

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రెండు వరుస ఓటముల తర్వాత విజయం కోసం చూస్తోంది. 16వ ఎడిషన్ టోర్నీలో నితీష్ రాణా సేన పర్వాలేదనిపిస్తోంది. రెండుసార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లు దారుణంగా విఫలమవుతున్నారు.
ఓపెనర్లు అధ్వాన్నమైన రికార్డును కలిగి ఉన్న ఏకైక జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రమే. kKR పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో వారు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. వెంకటేష్ అయ్యర్ వారి వైఫల్యాలను భర్తీ చేస్తున్నాడు. తన ఆటతీరుతో మిగతా జట్లకు పెద్ద ముప్పులా తయారయ్యాడు. మరియు గత కొన్ని ఆటలలో నిజమైన ముప్పుగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ 104 పరుగుల తరువాత ఆండ్రీ రస్సెల్ చేసిన 21 పరుగులే అత్యధిక స్కోరు. మిగిలిన లైనప్ అంతా తమకేమి పట్టనట్టు బ్యాటింగ్ చేస్తున్నారు.
ఈ సీజన్‌లో ‘స్పిన్’తో గెలవడం నైట్ రైడర్స్ మంత్రం. వారి స్పిన్నర్లు విజయవంతం కాని రోజుల్లో వారు గెలిచేందుకు చాలా కష్టపడ్డారు. ఇక KKR ఫాస్ట్ బౌలింగ్ త్రయం లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో వారు కేవలం తొమ్మిది వికెట్లు మాత్రమే తీశారు – ఈ సీజన్‌లో అన్ని జట్లలో ఇదే అతి తక్కువ.
జట్టు వార్తలు

ఆండ్రీ రస్సెల్‌కి ఇటీవలి కాలికి సంబంధించిన సమస్యలు ‘డీహైడ్రేషన్ క్రాంప్స్’ ఉన్నాయని నితీష్ రాణా తెలిపారు. కాకపోతే, నైట్ రైడర్స్‌లోని మిగతా స్క్వాడ్ సభ్యుల మాదిరిగానే అతను కూడా ఫిట్‌గా ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ అభిమన్యు ఈశ్వరన్, ప్రియమ్ గార్గ్‌లను ట్రయల్స్ కోసం పిలిచినట్లు తెలుస్తోంది. అయితే గత వారం నుండి ఖలీల్ అహ్మద్ గాయంపై ఎటువంటి వార్తలు లేవు.
టాస్, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

ఢిల్లీ క్యాపిటల్స్
క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేస్తే, వారు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగొచ్చు. ఇంపాక్ట్ కోసం పృథ్వీ షా,ముస్తాఫిజుర్ రెహమాన్ కాంబినేషన్ ఉపయోగించవచ్చు. అంతేతప్ప మిగతా మార్పులు ఏమీ ఉండకపోవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ XII: 1 డేవిడ్ వార్నర్ (కెప్టెన్), 2 పృథ్వీ షా, 3 మిచెల్ మార్ష్, 4 యశ్ ధుల్, 5 మనీష్ పాండే, 6 అక్షర్ పటేల్, 7 లలిత్ యాదవ్, 8 అమన్ ఖాన్, 9 అభిషేక్ పోరెల్ (వికె), 10 కుల్దీప్ యాదవ్, 11 అన్రిచ్ నోర్ట్జే, 12 ముస్తాఫిజుర్ రెహమాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్
రెహ్మానుల్లా గుర్బాజ్ పేలవమైన ప్రదర్శనతో, నైట్ రైడర్స్ జాసన్ రాయ్‌ని తీసుకురావడానికి ఉత్సాహం చూపుతుంది. అలాంటప్పుడు ఎన్ జగదీశన్ వారి వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తారు. టాస్‌ను బట్టి వెంకటేష్ అయ్యర్, సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ మార్పిడికి అవకాశం ఉంది.
నైట్ రైడర్స్ XII: 1 జాసన్ రాయ్/రహ్మానుల్లా గుర్బాజ్, 2 N జగదీసన్ (WK), 3 వెంకటేష్ అయ్యర్, 4 నితీష్ రాణా (కెప్టెన్), 5 రింకూ సింగ్, 6 ఆండ్రీ రస్సెల్, 7 సునీల్ నరైన్, 8 శార్దూల్ ఠాకూర్, 9 ఉమేష్ యాదవ్ లాకీ ఫెర్గూసన్, 11 వరుణ్ చకరవర్తి, 12 సుయాష్ శర్మ.
పిచ్ కండిషన్స్

2019 నుండి ఐపీఎల్‌లో అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండవ సారి బ్యాటింగ్ చేసిన జట్లు 13 గేమ్‌లలో 10 గెలిచాయి. ఆట జరిగే సమయానికి వాతావరణం బాగానే ఉంటుందని భావిస్తున్నారు.
ముఖ్యమైన గణాంకాలు
- వార్నర్ ఐపీఎల్ 2023లో ఇప్పటిదాకా 195 బంతులు ఎదుర్కొన్నా… ఒక్క సిక్సర్ కూడా లేదు.
- ఉమేష్ యాదవ్ ఐపిఎల్‌లో వార్నర్‌ను ఐదుసార్లు అవుట్ చేశాడు. అత్యధిక సార్లు అతనిని అవుట్ చేసిన బౌలర్ ఉమేష్ మాత్రమే.
- 2013 తరువాత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే. ఆ సీజన్‌లో ఢిల్లీ జట్టు చివరి స్థానంలో నిలిచింది.