ప్రధానాంశాలు
- నేడు ఢిల్లీ-ముంబైల మధ్య బిగ్ ఫైట్
- పాయింట్ల ఖాతా తెరిచేదెవరు?
- ముంబయి బోణీ కొడుతుందా?
- ఢీల్లీ పరాజయాలకు ఫుల్‌స్టాఫ్ పెడుతుందా?
- ఇరు జట్ల బలాబలాలేంటి?
ఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి విజయం కోసం అటు ఢిల్లీ, ఇటు ముంబయి ఆవురావుమంటూ ఎదురుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఢిల్లీ పరాజయం చవిచూసింది. కాగా పటిష్టమైన ముంబై సైతం ఆడిన రెండింట్లో ఓటమి మూటగట్టుకుంది. దీంతో నేటి మ్యాచ్ ఈ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో బోణి కొట్టాలని రెండు జట్లు ఆలోచిస్తున్నాయి. వార్నర్, పావెల్, రొస్సోలపై దిల్లీ జట్టు ఆశలు పెట్టుకుంది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్ సమిష్టిగా రాణించాలని చూస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియం ఈమ్యాచ్‌కు వేదిక కానుంది.
IPL 2023లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు అదృష్టం కలిసిరాలేదు. రెండు జట్లు ఇంకా తమ ఖాతాలను తెరవలేదు. ఇరు జట్లు తమ అత్యుత్తమ ఫైనల్ XIను ఇంకా గుర్తించలేదు సరికదా, రెడీమేడ్ పరిష్కారాలను సైతం అమలు చేయలేకపోయారు.
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ను బాగా ఆందోళన గురిచేస్తున్న అంశం వారి ఓపెనింగ్ పెయిర్. డేవిడ్ వార్నర్ మూడు గేమ్‌లలో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు, అయితే అతని పరుగులు 117.03 స్ట్రైక్ రేట్‌తో వచ్చాయి. మరోవైపు పృథ్వీ షా మూడు మ్యాచుల్లోనూ కేవలం 17 బంతులు మాత్రమే ఆడాడు. షా ఫామ్‌లోకి వస్తే వార్నర్ స్వేచ్ఛగా ఆడగలదు. అంతేకాదు ఢిల్లీ మిడిల్ ఆర్డర్ కూడా గాడిన పడుతుంది.
ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్ యాదవ్

మరోవంక కెప్టెన్ రోహిత్, ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్ విఫలమవడం ముంబైకి తీవ్ర నష్టం కలిగిస్తున్నది. టాపార్డర్ వీలైనంత త్వరగా ఫామ్ అందుకునే ముంబై గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒక్కటే జట్టులో కాస్త నిలకడగా రాణిస్తున్నాడు. అతనికి తోడుగా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో మరో బ్యాటర్ లేకపోవడం ముంబైకి నష్టం కలిగించేదే.
ముంబై జట్టుకు మరో ప్రధాన తలనొప్పి వారి బౌలింగ్. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో, వారు జోఫ్రా ఆర్చర్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. గాయం కారణంగా చెన్నయ్ మ్యాచ్‌కు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. నేటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది. దీంతో పేస్ దళంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
క్యాపిటల్స్ తాజా ఓటమి తర్వాత, వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ “ఆత్మ శోధన” కోసం పిలుపునిచ్చారు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నాతో మొదలుకొని సీనియర్ ఆటగాళ్లు మరింత మెరుగవ్వాలి’ అని అన్నాడు.
ఆర్చర్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నార్థకం

ఆర్చర్ గాయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. గతంలో కూడా కుడి మోచేయి కారణంగా అతను కొంత అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ముంబై అతన్ని వెనక్కి పంపే అవకాశం లేదు.
క్యాపిటల్స్ జట్టులో ఖలీల్ అహ్మద్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గేమ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. వారు మిచెల్ మార్ష్ ఇంకా జట్టలో చేరలేదు. అతను తన పెళ్లి కోసం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే.
టాస్, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ చేయడానికి జట్లు ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఇక్క ఎక్కువ సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. మరి నేడు ఏం జరుగబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ క్యాపిటల్స్

ఖలీల్ పూర్తిగా ఫిట్‌గా లేకుంటే, క్యాపిటల్స్ చేతన్ సకారియాను తీసుకురావచ్చు. వారు మొదట బ్యాటింగ్ చేస్తే, షా మొదటి XIలో ఉంటాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అతని స్థానంలోకి రావచ్చు. ముందుగా బౌలింగ్ చేస్తే వైస్ వెర్సా.
ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1. డేవిడ్ వార్నర్ (కెప్టెన్), 2 పృథ్వీ షా, 3 మనీష్ పాండే, 4 రిలీ రోసోవ్, 5 రోవ్‌మన్ పావెల్, 6 లలిత్ యాదవ్, 7 అక్షర్ పటేల్, 8 అభిషేక్ పోరెల్ (వికె), 9 చేతన్ సకారియా, 10 కుల్దీప్ యాదవ్, 11 అన్రిచ్ నోర్ట్జే
ఢిల్లీ మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు : 1 డేవిడ్ వార్నర్ (కెప్టెన్), 2 మనీష్ పాండే, 3 రిలీ రోసోవ్, 4 లలిత్ యాదవ్, 5 రోవ్‌మన్ పావెల్, 6 అక్షర్ పటేల్, 7 అభిషేక్ పోరెల్ (వికెట్), 8 చేతన్ సకారియా, 9 కుల్దీప్ యాదవ్, 10 అన్రిచ్ నోర్ట్జే, 11 ముఖేష్ కుమార్
ముంబై ఇండియన్స్

అర్షద్ ఖాన్ రెండు గేమ్‌లలో ఓవర్‌కు 14 పరుగులు ఇవ్వడంతో, ముంబై అతని బదులుగా సందీప్ వారియర్‌కు ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక ఆ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ కోసం… తిలక్ వర్మ, కుమార్ కార్తికేయలను ఉపయోగించవచ్చు.
ముంబయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 ఇషాన్ కిషన్ (వికెట్), 3 కెమెరూన్ గ్రీన్, 4 సూర్యకుమార్ యాదవ్, 5 తిలక్ వర్మ, 6 ట్రిస్టన్ స్టబ్స్, 7 టిమ్ డేవిడ్, 8 హృతిక్ షోకీన్, 9 పీయూష్ చావ్లా, 10 జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, 11 సందీప్ వారియర్
ముంబయి మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 ఇషాన్ కిషన్ (వికెట్), 3 కెమెరూన్ గ్రీన్, 4 సూర్యకుమార్ యాదవ్, 5 ట్రిస్టన్ స్టబ్స్, 6 టిమ్ డేవిడ్, 7 పీయూష్ చావ్లా, 8 హృతిక్ షోకీన్, 9 కుమార్ కార్తికేయ, 10 జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, 11 సందీప్ వారియర్
గణాంకాలు – రోహిత్ కష్టాలు

- ఐపీఎల్‌లో చివరిసారిగా రోహిత్ 24 ఇన్నింగ్స్‌ల క్రితం హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇదే సమయంలో, అతను 19.58 సగటుతో, 120.20 స్ట్రైక్ రేట్‌తో 470 పరుగులు చేశాడు.
- అక్షర్ పటేల్ T20 క్రికెట్‌లో రోహిత్‌పై ఆధిపత్యం చెలాయించాడు. రెండు సార్లు ఔట్ చేయడంతో సహా 49 బంతుల్లో 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
- 2022 ప్రారంభం నుంచి టీ20ల్లో ఐదుగురు బ్యాటర్లు 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టారు. వీరిలో నలుగురు – టిమ్ డేవిడ్ (124), రిలీ రోసౌ (123), రోవ్‌మన్ పావెల్ (101), సూర్యకుమార్ యాదవ్ (101) మంగళవారం బరిలోకి దిగనున్నారు. ఆ జాబితాలో ఐదో ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ (101).
అరుణ్ జైట్లీ స్డేడియం, పిచ్

2019 ప్రారంభం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం 31 టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. అందులో ఛేజింగ్ జట్లు 23 సార్లు గెలిచాయి. ఆరు ఓడిపోయాయి. 2 మ్యాచ్‌లు టై అయ్యాయి. గత వారం ఇక్కడ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడినప్పుడు, ఫాస్ట్ బౌలర్లకు తగినంత సహాయం లభించింది. మళ్లీ అదే జరిగితే క్యాపిటల్స్ లేదా ముంబై ఏమైనా జరగొచ్చు.