31.2 C
Hyderabad
Saturday, March 15, 2025

Buy now

spot_img

సిక్సర్ల ‘రింకు సింగ్’…క్రికెట్ పయనం కష్టాలతో కూడుకుంది!

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లు కూడా తమ జట్టు చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా వరుసగా ఐదు సిక్సర్లు కొట్టలేరేమో... కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలవలేని దశలో...  కోల్‌కతా ఊపిరి పీల్చుకో... నేనున్నాంటూ   రింకూ వచ్చాడు...

ప్రధానాంశాలు

  • సిక్సర్ల ‘రింకు సింగ్’పై సర్వత్రా ప్రశంసలు
  • క్రికెట్ పయనం కష్టాలతో కూడుకుంది
  • ప్రతి సిక్సర్ వారికే అంకితం
  • KKRతో ఐపీఎల్ కాంట్రాక్ట్
  • ‘rags to riches’ story లో రింకూ కథ

వావ్… అద్భుతం… మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవు… ఏమా ఆట.. ఏమా ఫినిషింగ్… దాదాపు ఓడిపోయే స్థితినుంచి తన జట్టును గెలుపు వాకిట చేర్చిన వైనం నభూతో న భవిష్యతి… ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లు కూడా తమ జట్టు చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా వరుసగా ఐదు సిక్సర్లు కొట్టలేరేమో… కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలవలేని దశలో…  కోల్‌కతా ఊపిరి పీల్చుకో… నేనున్నాంటూ   KKR  ఎడమచేతి వాటం ఆటగాడు రింకూ వచ్చాడు… సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇది సంవత్సరాల తరబడి గుర్తుండిపోయే అద్భుతమైన నాక్‌. అటు స్టేడియంలో ఇటు టీవీల ముందు కూర్చున్న లక్షలాది ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా చేసిన ఇలాంటి మ్యాచ్ బహుశా IPL చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం.

రింకూ సింగ్.. గుజరాత్, కోల్‌కతా మ్యాచ్‌కు ముందు వరకూ ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలీదు. ఉత్తర ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే రింకూ సింగ్ క్రికెట్ పయనం కష్టాలతో కూడుకుంది.

KKRతో ఇప్పుడు రూ. 55 లక్షల కాంట్రాక్టును పొందిన క్రికెటర్‌కు ‘rags to riches’ story లో రింకూ కథ కూడా ఉంటుంది. ఇది అసాధారణమైనది ఎందుకంటే ఆదివారం సాయంత్రం జరిగినది 25 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.  KKR ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న అచంచలమైన విశ్వాసం, మద్దతు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రింకూది దిగువ మధ్యతరగతి కుటుంబం.  అతడి తండ్రి ఖన్‌చంద్ర సింగ్ ఎల్‌పీజీ గ్యాస్‌ను ఇళ్లకు డెలివరీ చేసేవారు. చంద్ర సింగ్‌కు ఐదుగురు సంతానం కాగా.. రింకూ మూడోవాడు. చంద్ర సింగ్‌కు అలీగ్ స్టేడియానికి సమీపంలో గ్యాస్ కంపెనీ ఇచ్చిన రెండు గదుల క్వార్టర్‌లోనే రింకూ బాల్యం గడిచింది.

రింకూ పెద్దన్న ఆటో నడిపేవాడు. మరొకరు కోచింగ్ సెంటర్లో పని చేస్తారు. రింకూ సింగ్‌కు చదువు పెద్దగా అబ్బలేదు. తాను 9వ తరగతి ఫెయిల్ అయ్యానని చెప్పుకోవడానికి రింకూ ఏమాత్రం సిగ్గుపడడు. కుటుంబం అప్పులపాలు కావడంతో స్వీపర్‌ ఉద్యోగం చేసైనా సరే కుటుంబానికి అండగా నిలవాలని రింకూ సింగ్ ఓ దశలో భావించాడు. కానీ ఆ తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.  రింకూ యుపి అండర్-19 జట్టుకు ఆడుతున్నప్పుడు, తన రోజువారీ భత్యాన్ని పొదుపు చేయడం ప్రారంభించాడు.

“నా తండ్రి చాలా కష్టపడ్డాడు, నేను రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను  కొట్టిన ప్రతి సిక్సర్ నా కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తులకు అంకితం ఇస్తున్నానంటూ” అని రింకు తన మ్యాచ్ విన్నింగ్ నాక్ తర్వాత చెప్పాడు.

KKR అకాడమీ  ప్రారంభంలో రింకు కోసం ఆ జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి విస్తృతంగా పనిచేసింది. ఫలితంగా 2018-19 రంజీ సీజన్లో గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లు ఆడి 803 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో పది మ్యాచ్‌ల్లో అతడు 953 పరుగులు చేశాడు.

గత ఏడాది లక్నో‌తో జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓటమి దిశగా సాగుతున్న సమయంలో రింకూ సింగ్.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సులు బాదాడు. చివరి రెండు బంతుల్లో 3 పరుగులు అవసరమైన దశలో గెలుపు చివరిదాకా తీసుకొచ్చి ఆఖరి మెట్టుపై బోల్తాపడ్డాడు.  అయితే నిన్న మాత్రం చేసి చూపించాడు.

“(నాకు) నేను సాధిస్తానన్న  నమ్మకం ఉంది. గత సంవత్సరం నేను లక్నోలో ఇదే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు కూడా నమ్మకం ఉంది. అక్కడ పెద్దగా ఆలోచించలేదు. ఆ షాట్లు ఒకదాని తర్వాత ఒకటి ఆడాను. వరుసగా ఐదు సిక్సులు వచ్చేశాయి.  చివరి షాట్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు.

నితీష్ రానా

Source: Facebook

ఈ సీజన్‌కు KKR సారథి నితీష్ రానా మాట్లాడుతూ, “రింకూ గత సంవత్సరం ఇలాంటిదే చేసాడు. మేము ఆ మ్యాచ్‌లో గెలవకపోయినా, రెండవ సిక్స్ కొట్టినప్పుడు, యష్ దయాల్ అంత బాగా రాణించకపోవడంతో మాకు నమ్మకం కుదరింది. క్రెడిట్ గోస్ రింకూ సింగ్‌.

వెంకటేష్ అయ్యర్

Source: Instagram

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి 40 బంతుల్లో  83 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ…”ఈ మ్యాచ్‌లో మాకు రెండు పాయింట్లు దక్కినందుకు రింకూకి కృతజ్ఞతలు. జట్టులో రింకూ సింగ్‌కు ‘బిగ్ రోల్’ ఎందుకు పోషించడని,  ఎప్పుడూ చిన్న రోల్స్‌ ఎందుకు పోషిస్తారని జర్నలిస్టులు నన్ను అడిగారు. ఇప్పుడు నేను ఆ విలేకరులతో చెప్పాలనుకుంటున్నాను, ఊహించుకోండి. అతను ఈ మ్యాచ్‌లో  విభిన్నమైన పాత్రను పోషించాడు. అతని గురించి చెప్పేందుకు నా దగ్గర మాటలు లేవు అని చెప్పాడు. ” “ఈ మ్యాచ్ లార్డ్ రింకూ షో”గా బాగా గుర్తుండిపోతుంది. మేము ఈ ఆటను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటాం అని వెంకటేష్ అయ్యర్ చెప్పాడు.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles