38.2 C
Hyderabad
Sunday, March 16, 2025

Buy now

spot_img

శార్దూల్ దెబ్బకు విరాట్ కోహ్లీ 2019 నాటి ట్వీట్ వైరల్!

నిన్నటి ఐపీఎల్  మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. KKR ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో విరాట్ కోహ్లీ  2019 ట్వీట్ వైరల్ అయ్యింది.

ప్రధానాంశాలు

  • శార్దూల్ ‘హీరో’చిత ఇన్నింగ్స్
  • విరాట్ కోహ్లీ 2019 నాటి ట్వీట్ వైరల్
  • ‘తుల మాన్లా రే ఠాకూర్’
  • అంటే “హాట్స్ ఆఫ్ టు యు ఠాకూర్” అని అర్థం

నిన్నటి ఐపీఎల్  మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. KKR ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో విరాట్ కోహ్లీ  2019 ట్వీట్ వైరల్ అయ్యింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన  ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని జట్టును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఒకానొక సమయంలో 89/5తో కొట్టుమిట్టాడుతున్న నైట్ రైడర్స్… ‘ఆల్-రౌండర్’ శార్దూల్ ఠాకూర్ అదిరే ప్రదర్శనతో కేవలం 29 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అంతేకాదు రింకు సింగ్‌తో 6వ వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.  ఫలితంగా ఆతిథ్య జట్టు 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.  శార్దూల్ వీరోచిత పోరాటానికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కాయి. దీంతో అప్పట్లో 2019లో ‘వైరల్’ అయిన విరాట్ కోహ్లీ పాత ట్వీట్ మళ్లీ తెరపైకి వచ్చింది.

 

శార్దూల్ బ్యాట్‌తో ఎంత బాగా రాణించగలడో చూపించడం ఇదే మొదటిసారి కాదు. ఆల్ రౌండర్ భారత జట్టు కోసం, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో బ్యాట్‌తో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడి ఉన్నాడు. చాలా సందర్భాలలో శార్దూల్ సహచరుడిగా కోహ్లీయే ఉన్నాడు. అయితే ఈసారి ఇద్దరూ ప్రత్యర్థులుగా ఆడాల్సి వచ్చింది.

2019 నాటి విరాట్ ట్వీట్  ‘తుల మాన్లా రే ఠాకూర్’.
తుల మాన్లా రీ ఠాకూర్ @imShard pic.twitter.com/fw9z3dZ8Zi

— విరాట్ కోహ్లీ (@imVkohli) డిసెంబర్ 23, 2019
‘తుల మాన్లా రే ఠాకూర్’ అనే పదానికి అర్థం “హాట్స్ ఆఫ్ టు యు ఠాకూర్”. డిసెంబర్ 2019లో వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధించడంలో శార్దూల్ ముఖ్యమైన పాత్ర పోషించిన తర్వాత ఈ ట్వీట్ చేసాడు.

శార్దూల్ తన సొంత ప్రదర్శన గురించి మాట్లాడుతూ….

“అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందో కూడా నాకు తెలియదు. కానీ ఆ సమయంలో స్కోర్‌బోర్డ్‌ని చూస్తే, మా జట్టు కష్టాల్లో ఉందని అందరూ భావించారు. అయితే మేము చేసి చూపించాం.  మేము నెట్స్‌లో కూడా కష్టపడి పని చేస్తాము.  కోచింగ్ సిబ్బంది త్రోడౌన్లు చేస్తారు. మాకు రేంజ్-హిటింగ్ ఆప్షన్ ఇస్తారు.  పిచ్‌లు  ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తాయని తెలుసు అని శార్దూల్ అన్నాడు.

“సుయాష్ అనూహ్యంగా బౌలింగ్ చేసాడు. సునీల్, వరుణ్ నాణ్యత మాకు తెలుసు. వారు సరదాగా ఉంటారు, వికెట్లు తీస్తారు. అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో శార్ధూల్ చెప్పాడు.

ఈ విజయంతో, KKR ఇప్పుడు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది, ఒక గేమ్ గెలిచి ఒక గేమ్‌ను కోల్పోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles