24.7 C
Hyderabad
Sunday, March 16, 2025

Buy now

spot_img

ఐపీఎల్‌లో నేడు సరికొత్త ఘట్టం… రోహిత్‌ శర్మతో టాస్‌కు రానున్న హర్మన్‌ప్రీత్‌!

అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని మరీ ముఖ్యంగా క్రీడలు, చదువులో చురుగ్గా ఉండాలన్నది నీతా అంబానీ కల. అందులో భాగంగా నేటి మ్యాచ్‌లో టాస్‌కు రోహిత్‌ శర్మతో పాటు మహిళల జట్టు సారథి, డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీ విజేత హర్మన్‌ప్రీత్‌ వస్తోందని సమాచారం.

ప్రధానాంశాలు

  • ఐపీఎల్‌లో నేడు సరికొత్త ఘట్టం…
  • రోహిత్‌ శర్మతో టాస్‌కు రానున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్
  • ‘అందరికీ ఆటలు, విద్య’ అనే కార్యక్రమం
  • రిలయన్స్ ఫౌండేషన్, ముంబయి ఇండియన్స్
  • అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలి

ముంబై: అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని మరీ ముఖ్యంగా క్రీడలు, చదువులో చురుగ్గా ఉండాలన్నది నీతా అంబానీ కల. అందులో భాగంగా ఏప్రిల్ 16న అంటే ఈ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ వాంఖడేలో ఓ అపూర్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్.. బాలికలకు అంకితం చేయనుంది. క్రీడల్లో బాలికలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ అభిప్రాయాల ట్విట్టర్ లింక్

https://twitter.com/mipaltan/status/1647465594177081345?s=20

ముంబయి నగరంలోని 36 స్వచ్ఛంద సంస్థలకు చెందిన  19000 మంది బాలికలు, 200 మంది వికలాంగ బాలురు మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. రిలయన్స్ ఫౌండేషన్, ముంబై ఇండియన్స్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (ESA) ఫర్ ఆల్ చొరవలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. టీమ్ MI ప్రతి సీజన్‌లో అలాంటి ఒక మ్యాచ్‌ని నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమం గురించి నీతా అంబానీ మాట్లాడుతూ, “ఈ ప్రత్యేకమైన మ్యాచ్ క్రీడలలో మహిళల వేడుక. ఈ సంవత్సరం మొదటి మహిళా ప్రీమియర్ లీగ్‌తో భారత మహిళా క్రికెటర్లకు చారిత్రాత్మకమైన ప్రారంభం. బాలికల విద్య మరియు ఆటల హక్కును హైలైట్ చేయడానికి, మేము ఈ సంవత్సరం ESA కార్యక్రమాన్ని బాలికలకు అంకితం చేస్తున్నాము! రిలయన్స్ ఫౌండేషన్ ఈ ఆదివారం స్టేడియంలో ప్రత్యక్ష IPL మ్యాచ్‌ను ఆస్వాదించడానికి వివిధ NGOల నుండి 19000 మంది అమ్మాయిలను తీసుకురావడం గర్వంగా ఉంది.

Source: Twitter

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్‌లో తమ జట్టు జెర్సీని కూడా ధరించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్‌ను గెలుచుకుంది. రేపటి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా టాస్ వేయనుంది.

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్

Source: Times Now

‘ముంబయి ఇండియన్స్‌ కొన్నేళ్లు ఈఎస్‌ఏ డే నిర్వహిస్తోంది. నేనూ ఇందులో భాగం అవుతున్నాను. బాలికల ఎదుట ఆడటం చాలా బాగుంటుంది. క్రికెట్‌, ఇతర క్రీడల్లో వారు చురుగ్గా పాల్గొనేందుకు ఇలాంటివి మోటివేట్‌ చేస్తాయి. క్రీడలు వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయి’ అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘నీతా అంబానీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఈఎస్‌ఏ డే నిర్వహించడం అద్భుతం. ఈ విషయం తెలియగానే ఎంతో ఆనందం వేసింది’ అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles