ప్రధానాంశాలు
- బోణీ కొట్టిన ముంబయి
- రాణించిన కెప్టెన్ రోహిత్
- రెండేళ్ల తరువాత హాఫ్ సెంచరీ
- నాలుగో మ్యాచులోనూ ఓడిన ఢిల్లీ
ఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై తొలి విజయం సాధించింది. 2పాయింట్లతో ఖాతా తెరిచింది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఈ మ్యాచులో మాత్రం పట్టు వదల్లేదు. ఢిల్లీకి ఓటమి రుచి చూపించింది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్ సమిష్టిగా రాణించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించి ముంబై జట్టును ముందుండి నడిపించాడు.
ముంబయి గెలుపు క్షణాలు
Another result on the final ball of the game 🙌
An epic game to record @mipaltan's first win of the season 🔥🔥
Scorecard ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/u3gfKP5BoC
— IndianPremierLeague (@IPL) April 11, 2023
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (65: 45 బంతుల్లో 6×4, 4×6) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (31: 26 బంతుల్లో 6×4) ఇషాన్ రనౌటయ్యాడు. అయితే నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (41: 29 బంతుల్లో 1×4, 2×6) స్లాగ్ ఓవర్‌లో వరుస సిక్సర్లు బాదేశాడు.
దాంతో అలవోకగా గెలిచేలా కనిపించిన ముంబయి టీమ్.. తిలక్ వర్మ 139 పరుగుల వద్ద ఔటవగానే ఒత్తిడికి గురైంది. నెం.4లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) గోల్డెన్ డక్‌గా ఔటైపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. ఉత్కంఠత పెరిగింది.
చివరి ఓవర్ వేసిన నోకియా బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ జంట 1,0,0,1,1,2 పరుగులు చేసి ముంబయిని గెలిపించింది. లాస్ట్ బాల్‌కి రెండు పరుగులు అవసరం అవగా.. మిడాఫ్ దిశగా బంతిని కొట్టిన టిమ్ డేవిడ్ అతి కష్టంగా రెండు పరుగులు చేసి ముంబయిని మురిపించాడు.