ప్రధానాంశాలు
- ధోనీ మనస్తత్వంపై శిఖర్ ధావన్ కామెంట్స్
- క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడు?
- ధోనీ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడన్న ధావన్
- ధోనీని మిస్టర్ కూల్‌గా అభివర్ణించిన గబ్బర్
చండీగఢ్: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడిన భారత క్రికెటర్లు, క్లిష్ట పరిస్థితుల్లో ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడు?, అతను తీసుకున్న నిర్ణయాలు ఎందుకు విజయవంతం అవుతున్నాయనే విషయంపై ఎప్పుడూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు, రణవీర్ షో అనే యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ… కెప్టెన్ కూల్ ధోనీ నాయకత్వ సామర్థ్యంపై తన ఆలోచనలను వెల్లడించాడు.
ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్‌తో అతని అనుభవం గురించి అడిగినప్పుడు.. ధోనీ ఎప్పుడూ కూల్‌గా ఉన్నందువల్ల “జట్టులో రిలాక్స్డ్ వాతావరణం” ఉండేలా సహాయపడింది. దూకుడుగా ఉంటే మైదానంలోని వాతావరణం మారిపోయే అవకాశం ఉందని ధోనీకి బాగా తెలుసని.. అందుకే నిశ్శబ్దంగా తన పనేంటో చేసేస్తాడని ధావన్ తెలిపాడు.
ధావన్ MS ధోని యొక్క కొన్ని వ్యక్తిగత లక్షణాలపై కూడా మాట్లాడాడు… అతన్ని “చల్లని” వ్యక్తిగా పేర్కొన్నాడు. అతని సహచరులతో సంభాషించే విషయంలో లెజెండరీ కెప్టెన్ చాలా రిజర్వ్‌గా ఉంటాడని అన్నాడు. సరదాగా ఉంటూ.. ఎలాంటి గర్వం లేకుండా ప్రవర్తిస్తాడని తెలిపాడు.
ఒక్కోసారి కాస్త దూకుడుగా ఉంటాడు. అయినా తన్ను తాను నిగ్రహించుకుని నిర్ణయాలు తీసుకుంటాడని ధావన్ చెప్పాడు. ”చెప్పవలసిన విషయాలు” చెప్పడానికి ఇష్టపడతాడు. చెప్పకూడని విషయాలు అస్సలు ప్రస్తావించడు. ధోనీని “సరదాగా ప్రేమించే వ్యక్తి”గా ధావన్ అభివర్ణించాడు.
MS ధోని ఇప్పుడు IPLలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐదవ టైటిల్‌ను గెలవాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండో గేమ్‌లో అతని వ్యూహాత్మక మాస్టర్‌క్లాస్ చూసే అవకాశాన్ని అభిమానులకు లభించింది.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై 208 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు గొప్పగా ఉంది. CSK అనుభవం లేని బౌలింగ్‌పై లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ విరుచుకుపడుతున్నపుడు ధోనీ తన మెరుపును చూపించాడు. పరుగుల ప్రవాహాన్ని నిరోధించడానికి ముందుగానే స్పిన్నర్లను దించాడు. అతని నిర్ణయం గేమ్ ఛేంజర్‌గా మారింది. LSG బ్యాటింగ్ లైనప్ మోయిన్ అలీ, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా బౌలింగ్‌ను దీటుగానే ఎదుర్కొన్నా… విజయానికి 12 పరుగుల దూరంలో ఆగిపోయింది.
మరోవైపు, శిఖర్ ధావన్ IPL 2023లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అదరగొడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై రెండు వరుస విజయాలను నమోదు చేసాడు. ధావన్ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పాల్గొన్న రణవీర్ షో అనే యూట్యూబ్ పోడ్‌కాస్ట్ షో యూట్యూబ్ వీడియో….