ప్రధానాంశాలు
- ఐపీఎల్‌లో స్థిరంగా రాణిస్తున్న శిఖర్ దావన్
- ధావన్ ఫామ్ అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం
- భారత జట్టుకు ఎంపిక కాకపోడవడం రాణించాలన్న పట్టుదల
- నిన్న మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ధావన్
ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శిఖర్ ధావన్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా భారత జట్టులో వస్తూ పోతూ ఉన్న ధావన్ నిన్న రాజస్థాన్ రాయల్స్ (RR)పై 56 బంతుల్లో 86 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ధావన్ ఫామ్ జట్టుకు మాత్రమే కాకుండా అతని ఆత్మవిశ్వాసానికి కూడా ముఖ్యమని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పఠాన్ మాట్లాడుతూ… ధావన్ IPLలో సీనియర్ ఆటగాడు. బ్యాట్‌తో స్థిరంగా రాణిస్తున్నాడు. భారత జట్టుకు ఎంపిక కాకపోడవడం ధావన్‌ను ప్రభావితం చేసి ఉండవచ్చని, అందుకే అతను భారత క్రికెట్ యొక్క నిజమైన గబ్బర్‌గా నిరూపించుకోవాలనుకుంటున్నాడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.
RRతో గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి PBKS 197-4 భారీ స్కోరును నమోదు చేసింది. ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల 90 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్రతిస్పందనగా, RR లక్ష్యాన్ని ఛేజ్ చేస్తుందేమోననిపించింది. కానీ PBKS ఐదు పరుగుల తేడాతో విజయాన్ని ఒడిసి పట్టుకుంది.
PBKS ఆటతీరుతో ఆకట్టుకుందని పఠాన్ అన్నాడు. ముఖ్యంగా యువ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ఎల్లిస్, అతని IPL అరంగేట్రం సీజన్ రెండో మ్యాచ్ లోనే రాణించాడు. RR బ్యాట్స్‌మెన్ షిమ్రోన్ హెట్మేయర్ ధ్రువ్ జురెల్ ఆలస్యంగా పుంజుకున్నప్పటికీ, PBKS వారి టోటల్‌ను కాపాడుకోగలిగింది. విజయం సాధించింది.