ప్రధానాంశాలు
- పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి
- నెట్టింట వైరల్ అవుతున్న సంజు ట్వీట్
- ప్రతిసారీ మాకే ఇలా ఎందుకవుతోంది?
- అభిమానులను ఆకట్టుకుంటున్న ట్వీట్
అస్సాం ఆతిధ్యమిచ్చిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ పంజాబ్‌పై పోరాడి ఓడింది. ఈ ఓటమిపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బాగా నొచ్చుకున్నాడు. ప్రతిసారీ మాకే ఎందుకిలా జరుగుతుందని ట్వీట్ ద్వారా బాధను వ్యక్తపరిచాడు. కాగా సంజు ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇటు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అభిమానుల్ని, అటు శాంసన్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
“Paaji, har baar itne tight matches kyun?” 🫢 pic.twitter.com/Fn6zrc9La9
— Sanju Samson (@IamSanjuSamson) April 6, 2023
చివరిలో ఓవర్‌లో పంజాబ్‌ను గెలిపించిన సామ్ కరన్

లాస్ట్ ఓవర్‌లో మొదటి బంతిని జురెల్‌కి ఔట్‌సైడ్ ఆఫ్‌గా శామ్ కరన్ విసిరాడు. దాంతో అతికష్టంగా అతను బంతిని లాంగాన్ దిశగా హిట్ చేసి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత రెండో బంతికి కూడా అదే ప్లాన్. ఈసారి హెట్‌మెయర్ స్వీపర్ కవర్ దిశగా హిట్ చేసి డబుల్ తీశాడు. మూడో బంతి ఫుల్‌టాస్ విసిరాడు. హెట్‌మెయర్ రనౌట్. తర్వాత రెండు బంతుల్నీ ఫుల్ లెంగ్త్ డెలివరీల రూపంలో విసిరిన శామ్ కరన్.. జేసన్ హోల్డర్, జురెల్‌కి హిట్టింగ్ అవకాశం ఇవ్వలేదు. చివరి బంతికి జురెల్ ఫోర్ కొట్టినా.. రాజస్థాన్ రాయల్స్‌కి 5 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.