Home Cricket చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ!

చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ!

చిన్నస్వామి స్టేడియం సిక్సర్ల వర్షంలో తడిసిముద్దయింది. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా అన్నట్లు ఈ మ్యాచ్‌లో అటు CSK, ఇటు RCB బ్యాటర్లు కలిసి ఏకంగా 33 సిక్సర్లు బాదేశారు. ఇన్ని సిక్సర్లు ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.

0
93

ప్రధానాంశాలు:

  • చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం
  • దంచికొట్టిన CSK, RCB బ్యాటర్లు
  • 17 సిక్సర్లు కొట్టిన చెన్నై
  • 16 సిక్సర్లు బాదిన RCB
  • రికార్డు స్థాయిలో 33 సిక్సర్లు

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం సిక్సర్ల వర్షంలో తడిసిముద్దయింది. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా అన్నట్లు ఈ మ్యాచ్‌లో అటు CSK, ఇటు RCB బ్యాటర్లు కలిసి ఏకంగా 33 సిక్సర్లు బాదేశారు. ఇన్ని సిక్సర్లు ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే. 2018 సీజన్లో ఇదే జట్ల ( CSK -RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి 33 సిక్సర్లు నమోదు కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్- చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ 33 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక్కడ యాదృచ్ఛికమైన విషయమేమిటంటే.. అత్యధిక సిక్సర్లు నమోదైన ప్రతి మ్యాచ్‌లో చెన్నై జట్లు భాగస్వామిగా ఉండటం విశేషం. వాటిలో రెండు సార్లు CSK vs RCB మ్యాచ్‌లే.

తమ ఇన్నింగ్స్‌పై డెవాన్ కాన్వే, శివం దూబే మాటల్లో విందాం.

మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కాన్వే (45 బంతుల్లో 83;  6 సిక్సర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 52;  5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు నమోదు చేసుకోగా.. అజింక్యా రహానే (20 బంతుల్లో 37; 2 సిక్సర్లు), రాయుడు (14,ఒక సిక్సర్‌), మోయిన్‌ అలీ (19 నాటౌట్‌; 2 సిక్సర్లు), జడేజా ఒక సిక్సర్ కలిపి మొత్తం 17 సిక్సర్లు కొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో  బెంగళూరు సైతం తామేమీ అలవోకగా సిక్సర్లతో విరుచుకుపడింది. డుప్లెసిస్ 4 సిక్సర్లు, మ్యాక్స్‌వెల్‌ 8 సిక్సర్లు, షాబాజ్ అహమ్మద్, దినేష్ కార్తీక్ చెరో సిక్సర్, ప్రభు దేశాయ్ 2 సిక్సర్లు మొత్తంగా RCB బ్యాటర్లు 16 సిక్సర్లు కొట్టారు.

Source: Twitter

కాగా ఇదే  మ్యాచ్‌లో CSK బ్యాటర్ శివం దూబే 111 మీటర్ల దూరం లాంగెస్ట్ సిక్సర్ బాదాడు.   కాగా మొత్తం ఐపీఎల్ హిస్టరీలో 125 మీటర్ల దూరం సిక్సర్ కొటిన వీరుడు ఆల్బీ మోర్కెల్.

ఇదిలా ఉండగా ఐదు టైటిల్స్‌తో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్,  IPL చరిత్రలో ఒక జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్ల చార్ట్‌లో కూడా అగ్రస్థానంలో ఉంది.

ముంబై 235 మ్యాచుల్లో 1442 సిక్సర్లు బాదింది. అంటే సగటున 6.13 సిక్సర్లు ఉన్నాయి. మూడుసార్లు ఫైనలిస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1433 సిక్సర్లు కొడితే,  నాలుగుసార్లు టైటిల్ హోల్డర్ చెన్నై సూపర్ కింగ్స్ 1322 సిక్సర్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌లో 1000 సిక్స్‌ల మార్క్‌ను దాటిన ఇతర జట్లు.

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here