ప్రధానాంశాలు
- DC హ్యాట్రిక్ పరాజయాలు
- వార్నర్‌పై సెహ్వాగ్ మండిపాటు
- ఐపీఎల్‌లో ఆడొద్దు అన్న సెహ్వాగ్
- 25 బంతుల్లో 50 రన్స్ కొట్టమని సలహా
- సెహ్వాగ్‌తో ఏకీభవించిన రోహన్ గవాస్కర్
ఢిల్లీ: డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని DC హ్యాట్రిక్ పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటోంది. రిషబ్ పంత్ గైర్హాజరీతో ఈ సీజన్‌కు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వయంగా అర్ధ సెంచరీ సాధించినా RR చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
వేగంగా పరుగులు చేయడంలో వార్నర్ (55 బంతుల్లో 65 పరుగులు) విఫలమవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. వేగంగా పరుగులు చేయలేకపోతే మాత్రం “ఐపీఎల్‌లో ఆడవద్దు” అని కోరాడు.
“ఇప్పుడు మనం అతనికి ఇంగ్లీషులో చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను, తద్వారా వార్నర్ అది వింటాడు. బాధపడతాడు. డేవిడ్ మీరు నా మాటలు వింటున్నట్లయితే, దయచేసి బాగా ఆడండి. 25 బంతుల్లో 50 రన్స్ కొట్టమని సలహా ఇచ్చాడు. రాజస్థాన్ యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ నుండి నేర్చుకో. అతను 50 పరుగులను 25 బంతుల్లో కొట్టాడు. మీరు అలా చేయలేకపోతే, ఐపిఎల్‌లో ఆడకండి” అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ అన్నాడు.
“డేవిడ్ వార్నర్ 55-60 చేయడం కంటే 30 పరుగులకే ఔటైతే జట్టుకు మేలు జరిగేది. జట్టులో పెద్ద హిట్టర్లు రోవ్‌మన్ పావెల్, ఇషాన్ పోరెల్ వంటి ఆటగాళ్లు చాలా ముందుగానే బ్యాటింగ్‌కు దిగేవారు. అప్పుడు బహుశా ఏదైనా చేయగలరు. దురదృష్టం ఏంటంటే వారు బ్యాటింగ్‌కు వచ్చేసరికి తగినన్ని బంతులు లేవు అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
వార్నర్ సెహ్వాగ్ వ్యాఖ్యలను స్పోర్టివ్‌గా తీసుకుని తన స్ట్రైక్ రేటు మెరుగుపరుచుకుంటాడో, లేదంటే టోర్నమెంట్‌లో అతని ఫామ్ లేమితో పోరాడుతూనే ఉంటాడా లేదా అనేది చూడాలి.
IpL గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. వార్నర్ తన బ్యాటింగ్‌తో ఆదర్శంగా నిలవడం మరియు అతని సహచరులను అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రోత్సహించడం ఆ జట్టుకు అవసరం.
సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఏకీభవించిన రోహన్ గవాస్కర్

కాగా, వార్కర్ ఆటతీరుపై సెహ్వాగ్ అభిప్రాయాలతో భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ సైతం ఏకీభవించాడు. IPLలో 6000 పరుగులు చేసిన వార్నర్ లాంటి వ్యక్తి స్లో బ్యాటింగ్ చేస్తాడని ఊహించలేకపోయానని అన్నాడు. “ఒకవేళ 8 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటైతే.. ఎవరూ పట్టించుకోరు. కానీ, కెప్టెన్ అయి ఉండి, అనుభవం కలిగిన బ్యాటర్ ఎక్కువ బంతులను వృథా చేయడం సరైంది కాదు. రాజస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత డేవిడ్ వార్నర్ తీసుకోవాల్సిందే” అని రోహన్ అన్నాడు.