38.2 C
Hyderabad
Sunday, March 16, 2025

Buy now

spot_img

సన్‌ ‘రైజ్’ అయ్యేనా? నేడు పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ పోరు!

IPLసీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ నేడు సొంతగడ్డపై పటిష్టమైన పంజాబ్ కింగ్స్ జట్టును ఎదుర్కోబోతోంది. ఇక రెండు విజయాలతో సీజన్‌ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహలాడుతోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి...

ప్రధానాంశాలు:

  • నేడు పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ పోరు
  • నేటి మ్యాచ్‌లో సన్‌ ‘రైజ్’ అయ్యేనా?
  • కెప్టెన్ మార్క్రమ్, హ్యారీ బ్రూక్ రాణిస్తారా?
  • పంజాబ్‌కు హ్యాట్రిక్ విజయం దక్కేనా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్  సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు సొంతగడ్డపై పటిష్టమైన పంజాబ్ కింగ్స్ జట్టును ఎదుర్కోబోతోంది. సూపర్ సండేలో భాగంగా నేటి రాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో ధావన్ సేనతో అమీతుమీకి SRH సిద్ధమైంది.

సన్ రైజర్స్ టీమ్

Source: Twitter

ఈ రోజు జరుగనున్న మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు మార్క్రమ్ సేన అస్త్రశస్త్రాలతో రంగంలో దిగుతోంది. SRHలో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, మార్క్రమ్ లు అంచనాలకు తగినట్లు రాణిస్తే సన్‌రైజర్స్‌కు  తొలి విజయం దక్కుతుంది. బౌలింగ్‌లోనూ భువీ మునుపటిలా ఆరంభంలో వికెట్లు తీయాలి.. నటరాజన్ సైతం తన పదునైన యార్కర్లతో  ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల రాకతో ఉల్లాసంగా లక్నో వెళ్లింది. అయితే తలరాత మాత్రం మారలేదు. అయితే ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్‌లలోనూ  SRH జట్టుకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి అనే గట్టీ పట్టుదలతో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది.

మరోవంక SRH ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే ముగ్గురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలనుకుంటోంది. ఒకవేళ  బ్యాటింగ్‌లో ఇబ్బంది ఎదురైతే హెన్రిచ్ క్లాసెన్‌ని ఆడించాలని, బౌలింగ్ చేసేటప్పుడు మార్కో జాన్‌సెన్‌ని తీసుకోవాలని అనుకుంటోంది. మరోవంక ఐపీఎల్‌లో హ్యారీ బ్రూక్ ఆశించిన ఆరంభాన్ని అందించలేకపోయాడు. అతను తన రెండు సార్లు తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. అయితే సన్‌రైజర్స్ అతనికి మద్దతు ఇవ్వాలి.

ఇక రెండు విజయాలతో సీజన్‌ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహలాడుతోంది. జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. కాబట్టే  లియామ్ లివింగ్‌స్టోన్ రాక ఆలస్యమైనా, కగిసో రబడా ఇప్పుడే జట్టుతో చేరినా పంజాబ్ కింగ్స్ అలవోకగా రెండు విజయాలు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో  ఫేవరేట్ అంటే పంజాబ్ కింగ్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  అయితే చివరికి ఎవర్ని విజయం వరిస్తుందో వేచి చూద్దాం.

మరోవంక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అవసరమైతే యాంకర్ రోల్ పోషించేందుకు సైతం సిద్ధంగా ఉన్నాడు.  జట్టులో ఇప్పటికే ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు. నాథన్ ఎల్లిస్ రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టిన మంచి ఊపు మీద ఉన్నాడు.

రబడ ఆడతాడా?

Source: The Indian Express

లివింగ్‌స్టోన్ ఇప్పటికీ ECB నుండి క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాడు. డిసెంబర్‌లో పాకిస్థాన్‌లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి అతను ఎలాంటి అధికారిక క్రికెట్ ఆడలేదు.  రబడ అందుబాటులో ఉన్నాడు కానీ అతని కోసం వారు ఎల్లిస్‌ను పక్కన పెడతారో లేదో చూడాలి?

టాస్, ఇంపాక్ట్ ప్లేయర్ వ్యూహం

Source: T I E, ET

సన్‌రైజర్స్ హైదరాబాద్

లక్నోలో సన్‌రైజర్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్ళతోనే బరిలోకి దిగింది.  ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే స్పెషలిస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను  కాదని విదేశీ బౌలర్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

SRH మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1. అన్మోల్‌ ప్రీత్ సింగ్ (WK), 2 మయాంక్ అగర్వాల్, 3 రాహుల్ త్రిపాఠి, 4 ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), 5 హ్యారీ బ్రూక్, 6 అబ్దుల్ సమద్, 7. వాషింగ్టన్ సుందర్, 8. ఆదిల్ రషీద్, 9. భువనేశ్వర్ కుమార్, 10. ఉమ్రాన్ మాలిక్, 11. టి నటరాజన్

SRH మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 అన్మోల్‌ప్రీత్ సింగ్ (WK), 2. రాహుల్ త్రిపాఠి, 3 ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్.), 4 హ్యారీ బ్రూక్, 5 అబ్దుల్ సమద్, 6. వాషింగ్టన్ సుందర్, 7. మార్కో జాన్సెన్, 8. ఆదిల్ రషీద్, 9. భువనేశ్వర్ కుమార్, 10. ఉమ్రాన్ మాలిక్, 11. టి నటరాజన్

పంజాబ్ కింగ్స్

పంజాబ్ జట్టు ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో  మొదట బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే, వారు రిషి ధావన్‌తో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించే అవకాశముంది. ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు బదులుగా అతనిని సబ్సిట్యూట్ చేసే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 ప్రభ్‌సిమ్రాన్ సింగ్, 2 శిఖర్ ధావన్ (కెప్టెన్)మన్ ఎల్లిస్, 9 హర్‌ప్రీత్ బ్రార్, 10 రాహుల్ చాహర్, 11 అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయాల్సి వస్తే వారి ఫైనల్ XI ఇలా ఉండొచ్చు: 1 ప్రభ్‌సిమ్రాన్ సింగ్, 2 శిఖర్ ధావన్ (కెప్టెన్), 3 జితేష్ శర్మ (వికెట్), 4 సికందర్ రజా, 5 సామ్ కర్రాన్, 6 M షారుక్ ఖాన్, 7 హర్‌ప్రీత్ బ్రార్, 8 రిషి ధావన్, 9 నాథన్ ఎల్లిస్, 10 రాహుల్ చాహర్, 11 అర్ష్‌దీప్ సింగ్

ముఖ్యమైన గణాంకాలు:

ఇది గత ఐదేళ్లుగా ఇరు జట్లు ఒక్కొక్కటి ఐదు విజయాలు సాధించడంతో గట్టి పోటీగా ఉంది, అయితే హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ కింగ్స్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది.
సన్‌రైజర్స్ వరుసగా రెండు పరాజయాలతో ప్రారంభించడం ఇది వరుసగా నాలుగో సీజన్. అయితే, T20 క్రికెట్‌లో ఫ్రాంచైజీ గెలిచిన రెండు టైటిల్‌లు మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాతే రావడం విశేషం.

మయాంక్ అగర్వాల్‌ పరుగులు చేయాలి

Source: Twitter

మయాంక్ అగర్వాల్ కెరిర్ 2019 నుండి 2021 వరకు పీక్ రేంజ్‌లో ఉంది. 2019 మరియు 2021 మధ్య యావరేజ్ 34.2, స్ట్రైక్ రేట్ 146.15. అయితే ఆ తరువాత బాగా వెనకబడ్డారు. జట్టుకు భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు.  ఈ మధ్యకాలంలో 121.57 స్ట్రైక్ రేట్‌తో 16.5 సగటుతో ఉన్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles