ప్రధానాంశాలు
- ప్రస్తుతం T20 లీగ్‌ల హవా
- అప్పట్లో ద్వైపాక్షిక సిరీస్‌లు
- క్రికెటర్ల అలవాట్లపై సెహ్వాగ్ సెటైర్లు
- అప్పట్లో ఒకరితో మరోకరు మాట్లాడుకునేవారు
- నేడు ఐఫోన్‌లతో బిజీ అయిన క్రికెటర్లు
క్రికెట్ అనేది మైదానంలో అంకితభావాన్ని కోరుకునే ఓ క్రీడ. క్రికెటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శారీరకంగా, మానసికంగా అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం T20 లీగ్‌ల విస్తారంగా పెరగడంతో క్రికటర్లు లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రధానంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన ఇతర క్రికెటర్లతో ఆటగాళ్ళతో సంభాషించడానికి అవకాశం ఉండేది. అయితే, నేటి క్రికెటర్లు, మ్యాచ్ తర్వాత, తోటి క్రికెటర్లతో చాట్ చేయకుండా… వారి ఐఫోన్‌లతో సోషల్ మీడియాలో ఎక్కువగా బిజీగా ఉంటున్నారు
విధ్వంసక బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల క్రికెటర్ల అలవాట్లు, వ్యక్తిత్వాలపై ఆసక్తికరమైన విషయాలను ఓ టీవీ చానల్‌తో పంచుకున్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్

- ఉదాహరణకు, భాషా అవరోధాల కారణంగా శ్రీలంక క్రికెటర్లు తమ ప్రత్యర్థులతో మాట్లాడకుండా కామ్‌గా ఉంటారు.
- ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు రోజుల తరబడి స్నానం చేయరని సెహ్వాగ్ ఇంగ్లీష్ జట్టు గుట్టు విప్పాడు. కొంతమంది ఆటగాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేస్తారు. ఇంగ్లండ్‌లో వాతావరణం చల్లగా ఉండటమే ఇందుకు కారణమని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
- ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మహిళలంటే పడిచస్తారని, వారి ప్రవర్తనతో కేసులు కూడా ఎదుర్కొన్నారని సెహ్వాగ్ అన్నాడు.
- వెస్టిండీస్ జట్టుకు పార్టీలంటే బాగా ఇష్టపడతారన్నారు. కరేబియన్ ఆటగాళ్లు పగటిపూట నిద్రపోతారు, రాత్రంతా మేల్కొని ఉంటారు.
- యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పార్టీలంటే పడిచస్తాడు. ఈ కారణంగా అపఖ్యాతి పాలయ్యాడు. అయినా వెస్టిండీస్ ఆటగాళ్లు మైదానంలో చురుగ్గా ఉంటారని సెహ్వాగ్ తెలిపాడు.
- పాకిస్థాన్ క్రికెటర్లు తిట్టిన బూతులు ఎవరు తిట్టుకొరు అని చెప్పుకొచ్చాడు.పాకిస్థాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అని భయపడేవాడినని చెప్పుకొచ్చారు.
- అప్పట్లో ఓసారి సోనీ టీవీ కపిల్ శర్మ షోకు వచ్చిన సందర్భంగా సెహ్వాగ్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
- క్రికెట్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోనప్పటికీ ఆటగాళ్ల వ్యక్తిత్వాలు, అలవాట్లలో మాత్రం పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయని గుర్తుచేసుకున్నారు.
క్రికెట్ ఆడే వివిధ దేశాల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలను కూడా సెహ్వాగ్ టీవీ షో మాటల సందర్భంలో పంచుకున్నాడు.. కొన్ని జట్లు ఎక్కువ రిజర్వ్‌గా ఉండి, గేమ్‌పై దృష్టి కేంద్రీకరిస్తే, మరికొన్ని జట్లు ఎక్కువ అవుట్‌గోయింగ్‌పై దృష్టిపెడతాయని సెహ్వాగ్ ఆ టీవీ షోలో సెలవిచ్చాడు. మైదానం వెలుపల సోషల్ లైఫ్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. మ్యాచ్‌ల సమయంలో, ఆ తర్వాత ఆటగాళ్ళు ప్రవర్తించే విధానంలో ఈ తేడాలు తరచుగా కనిపిస్తాయి.
క్రికెట్ స్టేడియం

ఆటలో మార్పులు వచ్చినా, టీ20 లీగ్‌లు పెరిగినా.. క్రికెట్ మాత్రం అలాగే ఉందని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ విభిన్న నేపథ్యాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చే ఆట, క్రికెట్ పట్ల చూపే సాధారణ ప్రేమ ఆటగాళ్లను ఏకం చేస్తుందని సెహ్వాగ్ అన్నాడు. ఆటగాళ్ళు విభిన్న అలవాట్లు, వ్యక్తిత్వాలు ఉండవచ్చు, అయితే వారు క్రికెట్ అంటే ఒకే అభిరుచికి కట్టుబడి ఉంటారు.
క్రికెట్ అంటే డబ్బు, కీర్తి మాత్రమే కాదు, ఆటగాళ్ల మధ్య ఏర్పడే స్నేహాన్ని గుర్తు చేస్తాయి. ప్రస్తుత క్రికెటర్లు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరి ఫోన్లు వారు తీసుకొని వారు అందులో మునిగిపోతారని. ఇదివరకు కాలంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రికెటర్లు అందరు ఒకచోట కూర్చుని ఆటకు సంబంధించిన విషయాలే కాకుండా మరెన్నో విషయాలు చర్చించుకునే వారని వీరూ చెప్పుకొచ్చాడు