ప్రధానాంశాలు:
- భారత క్రికెట్ నయా సంచలనం యశస్వి
- భారత క్రికెట్ భవిష్యత్ తార
- టీం ఇండియా ఎదురుచూస్తున్న రత్నం
- యశస్వి జైస్వాల్‌లో తరతరాల ప్రతిభ ఉంది
- పానీపూరీ నుంచి ఐపీఎల్ దాకా స్ఫూర్తిదాయక పయనం
- ఇండియన్ టీంలోకి ఎంటర్ అవుతాడంటున్న విశ్లేషకులు
భారత క్రికెట్ నయా సంచలనం… 21 సంవత్సరాల వయసులో క్రికెట్ మైదానంలో అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న ఆటగాడు…భారత క్రికెట్ భవిష్యత్ తార అంటూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న యువ కిశోరం… యశస్వీ జైశ్వాల్. ముంబైలో పెరిగిన యశస్వికి క్రికెట్‌పై చిన్న వయస్సులోనే ప్రేమ మొదలైంది.
యశస్వి జైశ్వాల్

యశస్వీ జైశ్వాల్ తన స్నేహితులతో కలిసి వీధుల్లో ఆడుకునేవాడు. తన అసాధారణ ఆటతీరుతో వెంటనే స్థానిక కోచ్‌ల దృష్టిని ఆకర్షించాడు. వారు అతని ప్రతిభకు ముగ్ధులయ్యారు. క్రికెట్ ప్రాక్టీస్ మరింత తీవ్రంగా కొనసాగించమని ప్రోత్సహించారు.
యశస్వి కృషి, అంకితభావం త్వరలో ఫలించాయి. ముంబై స్థానిక క్రికెట్ సర్కిల్‌లలో స్టార్ పెర్ఫార్మర్‌గా మారాడు. యశస్వీ జైశ్వాల్ అసాధారణ ప్రదర్శనలు భారత అండర్-19 జట్టుకు పిలుపునిచ్చాయి. 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశం యొక్క చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కట్ చేస్తే…

యశస్విలోని ప్రతిభకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు పట్టం కట్టారు. కేవలం 20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన జైస్వాల్‌ను దక్కించుకోవడం కోసం జట్లన్నీ పోటీపడ్డాయి. ఆఖరుకు రాజస్థాన్ రాయల్స్ 2.4 కోట్ల రూపాయలకు అతణ్ని దక్కించుకుంది.
తన అద్భుత ఆటతీతరుతో రాజస్థాన్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఓపెనర్‌గా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. IPL 2023లో మొన్నటికి మొన్నచెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు మెరుపులు మెరిపించాడు. 21 ఏళ్ల ఆటగాడు ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 304 పరుగులు చేశాడు. 147.57 స్ట్రైక్ రేట్‌తో, 38 సగటును నమోదు చేశాడు. ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలతో పాటు 40 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. దీంతో యశస్వి జైస్వాల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
Yashasvi Jaiswal talking about that he has learned a lot from MS Dhoni, Virat Kohli and Sangakkara!pic.twitter.com/7wyXqOw2fj
— CricketMAN2 (@ImTanujSingh) April 28, 2023
- నన్ను బాగా ఆకట్టుకున్న బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యశస్వి జైస్వాల్ అని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు.
- ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ మాట్లాడుతూ… యశస్వి జైస్వాల్‌ను తరతరాల ప్రతిభ అని కొనియాడాడు. “21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఒక తరం ప్రతిభ దాగి ఉంది. నిజమైన ఆల్ ఫార్మాట్ ఆటగాడు. టీమ్ ఇండియా ఒక రత్నం కోసం ఎదురుచూస్తోంది” అని ట్వీట్ చేశాడు.
టామ్ మూడీ ట్విట్టర్ లింక్

యశస్వీ జైశ్వాల్, కోచ్ జ్వాలా సింగ్

యశస్వి జైస్వాల్ తనకు ఇండియా ఏ టీంలో చోటు దక్కినపుడు చిన్ననాటి కోచ్, గార్డియన్ జ్వాలా సింగ్‌కి తన ఇండియా A క్యాప్‌ను బహుకరించాడు. దానికి జవాబుగా కోచ్ జైశ్వాల్‌కు ఓ సవాల్ విసిరాడు. “జబ్ తు ముజే సీనియర్ ఇండియన్ టీమ్ కా క్యాప్ దేగా, మెయిన్ తభి ఇస్ టోపీకో పెహ్నుంగా (నువ్వు ఇండియా టీంలోకి సెలెక్ట్ అయితే అప్పుడు నేనే టోపీని ధరిస్తాను )”
ఇరానీ ట్రోఫీలో డబుల్ సెంచరీ ట్విట్టర్ లింక్
.@ybj_19 roars at the Captain Roop Singh Stadium 💪 💪
A spectacular 2️⃣0️⃣0️⃣ 👏 to help build a solid foundation with Abhimanyu Easwaran
Follow the match 👉 https://t.co/L1ydPUXHQL #IraniCup | #MPvROI | @mastercardindia pic.twitter.com/AIrv9JYEAW
— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2023
యశస్వికి ఇప్పుడు 21 ఏళ్లు. కానీ అతని చిన్నతనం నుండే సవాళ్లను స్వీకరించడం, అడ్డంకులను గట్టి సంకల్పంతో అధిగమించడం నేర్చుకున్నాడు. వైఫల్యం ఎప్పుడూ దరిచేరయనీయలేదు. అతను 13 సంవత్సరాల వయస్సులో డేరాలలో నిద్రించడం నుండి U19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం వరకు ఎక్కడా అలసత్వం దరిచేరనీయలేదు.
ఇండియా A కోసం సెంచరీని కొట్టడం, IPLలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో అంతర్భాగంగా మారడం వరకు… యశస్వి చాలా దూరం పయనించాడు. కానీ తన కోచ్ జ్వాలా సింగ్ చెప్పినట్లుగా, అతను ఇప్పటికీ తన లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాడు. ఈ ఐపీఎల్‌లో పవర్-ప్యాక్డ్ ప్రదర్శనలతో టీం ఇండియాలో ప్రవేశానికి తలుపులు తడుతున్నాడు.
కుటుంబసభ్యులతో యశస్వి జైశ్వాల్

యశస్వి జైస్వాల్ ఎదుగుదలను మనం చూస్తున్నప్పుడు,.. ఆట పట్ల అతనికున్న అభిరుచి, అతని అసాధారణ నైపుణ్యం అతన్ని ఇప్పటికే మైదానంలో తిరుగులేని క్రికెటర్‌గా మార్చింది. అతను రాన్రాను మరంఇత పరిణతి చెందుతూనే ఉన్నాడు యశస్వి జైశ్వాల్ భారతదేశం దిగ్గజ క్రికెటర్లలో ఒకడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
యువ కిశోరం యశస్వి జైస్వాల్ కెరీర్, జీవిత విశేషాలను అద్భుతంగా వివరించారు.