Home Chess భారత చదరంగంలో నయా సంచలనం…ఆర్. ప్రజ్ఞానంద!

భారత చదరంగంలో నయా సంచలనం…ఆర్. ప్రజ్ఞానంద!

నుదిటిపై పవిత్రమైన బూడిద పూసుకుని అమాయకంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు...విశ్వనాథన్ ఆనంద్ ప్రియశిష్యుడు. నేడు చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వయసుకు మించిన ప్రతిభతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడీ యువ సంచలనం. తాజాగా ఫిడే - 2023 ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రన్నరప్ గా నిలిచాడు. 

0
127

ప్రధానాంశాలు

  • భారత చదరంగంలో నయా సంచలనం
  • నాడు ఆనంద్, నేడు ప్రఙ్జానంద్
  • పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా
  • మాగ్నస్ కార్లసన్‌ని మూడు సార్లు ఓడించిన ఘనాపాటీ
  • అతని ఎలో రేటింగ్‌లు ఎవరెస్ట్ ఎత్తుకు
Source: Twitter

నుదిటిపై పవిత్రమైన బూడిద పూసుకుని అమాయకంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు…విశ్వనాథన్ ఆనంద్ ప్రియశిష్యుడు. నేడు చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వయసుకు మించిన ప్రతిభతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు ప్రజ్ఞానంద్. తాజాగా ఫిడే – 2023 ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రన్నరప్ గా నిలిచాడు.

తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఎత్తులు పై ఎత్తులతో సాగే చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం ఓ పెద్ద పరీక్షే. ఐదేళ్ల వయసు నుంచే చదరంగం ఆడుతూ ఎన్నో సంచలన విజయాలు సాధించిన విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఆటగాడే…18 ఏళ్ల వయసులో కానీ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించలేకపోయాడు. అలాంటి ఘనతను తమిళనాడు చిచ్చర పిడుగు ప్రజ్ఞానంద కేవలం 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి…తలపండిన చెస్ పండితులనే ముక్కున వేలేసుకునేలా చేసాడు. అంతేకాదు విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే ప్రపంచ కప్‌‌ ఫైనల్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. చిన్నప్పుడు అక్కను చూసి చదరంగం నేర్చుకొని.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లకు చెమటలు పట్టిస్తున్నాడు.

ఎవరీ ప్రజ్ఞానంద ?

కుటుంబ సభ్యులతో ప్రజ్ఞానంద

Source: ESPN

ప్రజ్ఞానంద పూర్తి పేరు… రమేశ్ బాబు ప్రజ్ఞానంద. చెన్నైలో బ్యాంకు ఉద్యోగి రమేష్ బాబు, నాగలక్ష్మి దంపతులకు ఆగస్టు 10, 2005న జన్మించాడు. చిన్నప్పటి నుంచే చెస్ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకున్నాడు. తద్వార భారత దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ పేరిట అప్పటి వరకు ఉన్న అతిపిన్న గ్రాండ్ మాస్టర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది..అది సాధించిన అతి పిన్న భారతీయుడిగా రికార్డు సాధించాడు. అయితే ఆ రికార్డును కాస్తా ప్రజ్ఞానంద తన పేరు మీద లిఖించుకున్నాడు. 2019లో డెన్మార్క్ వేదికగా జరిగిన జ్రాకోన్ చెస్ ఓపెన్ లో విజయం సాధించాడు.. అనంతరం 2021లో పొల్గార్ చాలెంజర్ చెస్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు.

తన ఆరాధ్య ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌తో 

Source: Facebook

ప్రజ్ఞానందకు ఓ అక్క కూడా ఉంది. ఆమె పేరు వైశాలి.  మెల్లిగా చదరంగంపై పట్టు సాధించింది. ఐదేళ్లు రాగానే బ్లూమ్ చెస్ అకాడమీలో ఆ చిన్నారిని చేర్పించారు. అద్భుతంగా రాణించిన వైశాలి.. అండర్-11,13,15ల విభాగంలో దేశస్థాయిలో బంగారు పతకాలు సాధించింది. 2015లో నేషనల్ చైల్డ్ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకొంది.

అక్క సాధిస్తోన్న అద్భుత విజయాలను చూస్తూ పెరిగిన ప్రజ్ఞానంద కూడా చదరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. అలా అక్కాతమ్ముళ్లు ఇద్దరూ చెస్పై ఆసక్తి పెంచుకోవడంతో రమేష్ బాబు- నాగలక్ష్మి దంపతులు  ఇద్దర్నీ టోర్నిలకు తీసుకెళ్లడంతో పాటు ఇంటి దగ్గర వాళ్ల ప్రాక్టిస్ ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవారు.

ఇద్దరు పిల్లలు టోర్నిలకు వెళ్లినప్పుడు తల్లి నాగలక్ష్మి కూడా వారితోనే ఉండేది. హోటళ్లలో ఆహారం ఖరీదు ఎక్కువగా ఉండటంతో తనతోపాటు రైస్ కుక్కర్ తీసుకెళ్లి పిల్లలకు పెరుగన్నం, సాంబారన్నం, రసమన్నం వండిపెట్టేదాన్నని.. ఆమె స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది ప్రముఖ కోచ్ ఆర్.బి. రమేష్ బాబుకు చెందిన చెస్ గురుకుల్లో వీరు ఆయా టోర్నిలకు ముందు మూడు నెలలు శిక్షణ తీసుకొనే వారు.

కోచ్ రమేష్ బాబుతో ప్రజ్ఞానంద

Source: ABP News

ప్రజ్ఞానంద ఎప్పుడూ చెస్ గురించి ఆలోచిస్తాడు” అని అతని కోచ్ RB రమేష్ చెప్పారు. అతనికి ఏడేళ్ల వయసు నుంచి రమేష్ కోచింగ్ ఇస్తున్నాడు. తండ్రి బ్యాంక్ మేనేజర్,  తల్లి సామాన్య గృహిణి.  ప్రజ్ఞానంద అందరితో “చాలా స్నేహపూర్వకంగా” ఉంటాడని రమేష్ చెప్పారు. ఖాళీ సమయాల్లో ప్రజ్ఞానంద  స్నేహితులతో కలిసి చెన్నైలో టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడటం ఇష్టపడతాడని కోచ్ చెప్పాడు.

చదరంగపు శక్తిగా భారత్..

మనదేశంలో ఇప్పటి వరకు 73 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. 2007లో ఈ సంఖ్య కేవలం 20 మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరి వాటికి ప్రపంచ టాప్ 100 ర్యాంకింగ్ లో ఏడుగురు భారతీయ ఆటగాకు ఉన్నారు. దాదాపు 50 వేల మంది చదరంగపు కీడాకారులు రిజిస్టర్ అయి ఉన్నారు.

“ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు, మాకు శిక్షకుల కొరత ఉంది. మాజీ చెస్ ఆటగాళ్లందరికీ శిక్షణ ఉద్యోగాలు ఉన్నాయి” అని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ సింగ్ చౌహాన్ చెప్పారు.
ప్రజ్ఞానానంద కోచ్ రమేష్ ఒక ఉదాహరణ. మాజీ కామన్వెల్త్ చెస్ ఛాంపియన్, అతను ఆట నుండి రిటైర్ అయ్యాడు. 2008లో చెన్నైలో కోచింగ్ స్కూల్‌ను ప్రారంభించడం కోసం ప్రభుత్వ ఆయిల్ కంపెనీలో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నేడు, 1,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు – 7 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు – నలుమూలల నుండి ప్రపంచం అక్కడ పాఠాలు తీసుకుంటుంది. ఆర్థిక స్థోమత లేని కారణంగా మూడోవంతు విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పిస్తున్నారు.

“భారతీయ పిల్లలు చాలా ఉత్సాహంగా, శ్రద్ధగా, కష్టపడి పనిచేస్తారు. భారతదేశంలో ఆట పురోగమించడానికి ప్రధాన కారణం గ్రాండ్ మాస్టర్స్‌గా మనకు ఎక్కువ అర్హత కలిగిన శిక్షకులు, మంచి ఆటగాళ్ళు ఉపాధ్యాయులుగా మారడం” అని రమేష్ చెప్పారు.

అయినప్పటికీ, అర్హులైన ప్రతిభావంతులందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముందు భారతదేశం కూడా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని గ్రాండ్‌మాస్టర్ ప్రవీణ్ థిప్సే అభిప్రాయపడ్డారు. అతను ఇప్పటికీ యజమాని, స్పాన్సర్ లేని టాప్ గ్రాండ్‌మాస్టర్ గురించి మాట్లాడాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు కంపెనీలు, రైల్వేలు, ర్యాంక్ చెస్ క్రీడాకారులను నియమించుకున్నాయని, అయితే టోర్నమెంట్‌లలో ప్రైజ్ మనీ సాధారణంగా వారి నిరాడంబరమైన జీతాల కంటే తక్కువగానే ఉంది.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here